ప్ర‌భాస్ కి తమిళనాడు గ‌వ‌ర్న‌మెంట్ స‌పోర్ట్..!

Update: 2022-02-03 08:31 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్టు మూవీ 'రాధే శ్యామ్' విడుదలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో శరవేగంగా ప్రమోషన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన స్పెషల్ పోస్టర్స్ - టీజర్ - అన్ని పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై అంచనాలు పెంచేసాయి.

'రాధేశ్యామ్' చిత్రాన్ని రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్స్ పై వంశీ - ప్రమోద్ - ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. హిందీలో టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమాకి త‌మినాడు గ‌వ‌ర్న‌మెంట్ స‌పోర్ట్ కూడా లభించబోతున్నట్లు తెలుస్తోంది.

త‌మిళంలో 'రాధేశ్యామ్' చిత్రాన్ని సీఎం స్టాలిన్ తనయుడు, హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ గ్రాండ్ గా విడుద‌ల చేయ‌బోతున్నారు. స్టాలిన్ ఫ్యామిలీకి చెందిన డిస్ట్రీబ్యూష‌న్ కంపెనీ ప్రభాస్ సినిమాని త‌మిళ‌నాడుతో పాటు మలేషియా - శ్రీలంక త‌దిత‌ర త‌మిళ ఓవ‌ర్ సీస్ సెక్టార్ లో కూడా విడుద‌ల చేయ‌నుందని సమాచారం. వరల్డ్ వైడ్ గా అత్యధిక స్క్రీన్స్ లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

కాగా, 'రాధే శ్యామ్' చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్య గా ప్రభాస్ నటించగా.. ఆయనకు జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. కృష్ణంరాజు - భాగ్యశ్రీ - జగపతి బాబు - మురళీ శర్మ - సచిన్‌ ఖేడ్‌కర్‌ - జయరామ్ - ప్రియదర్శి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చగా.. ఎస్ ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నారు. మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ అందించగా.. ఆర్‌.రవీందర్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్ చేసారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ప్రభాస్ కెరీర్ లో ఎలాంటి ఫైట్స్ లేకుండా పూర్తిస్థాయి ప్రేమకథగా రాబోతున్న 'రాధే శ్యామ్' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడా
Tags:    

Similar News