నటి మృతి కేసులో కొత్త కోణం

Update: 2020-12-21 10:30 GMT
తమిళ ప్రముఖ నటి వీజే చిత్ర ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆమె భర్తను అనుమానితుడిగా పోలీసులు ఇప్పటికే విచారిస్తున్నారు. పోలీసుల అదుపులో చిత్ర భర్త హేమనాథ్ ఉన్నాడు. ఆయన్ను విచారిస్తున్న సమయంలోనే ఈకేసులో కొత్త కోణంను హేమనాథ్‌ తండ్రి తీసుకు వచ్చాడు. చిత్ర మృతి చెందడానికి ముందు ఆమె వేదింపులకు గురైనట్లుగా పేర్కొన్నాడు. చిత్రకు ఎవరో గుర్తు తెలియని వారు ఫోన్‌ చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఆమె తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయేదని.. పక్కకు వెళ్లి మాట్లాడటంతో పాటు ఆ తర్వాత నెంబర్‌ డిలీట్‌ చేసేదని కూడా ఒకానొక సమయంలో హేమనాథ్‌ నాతో అన్నాడంటూ ఆయన తండ్రి రవిచంద్రన్‌ ఆరోపిస్తున్నాడు.

చిత్ర ను మానసికంగా ఇబ్బంది పెట్టింది ఎవరు.. ఆమెను వేదింపులకు గురి చేసింది ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలంటూ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌ లో రవిచంద్రన్‌ డిమాండ్ చేశాడు. చిత్ర కొన్ని రోజులుగా టెన్షన్‌ పడుతూ ఉందని.. ఆమె ఏదో విషయం దాస్తుంది.. ఆమెను ఎవరో వేదిస్తున్నారంటూ హేమనాథ్ నాతో కొన్ని సందర్బాల్లో చెప్పాడు. ఇంతలోనే ఆమెకు ఇలా అయ్యింది. ఆమె వేదింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంది. ఆ వేదింపులకు పాల్పడింది ఎవరో గుర్తించాలి. చిత్ర.. హేమనాథ్ లు పెళ్లి చేసుకోవడం ఎవరికో ఇష్టం లేదు. వారే ఈ వేదింపులకు పాల్పడి ఉంటారు. కనుక వారిని విచారిస్తే మొత్తం విషయం బయటకు వస్తుందనే అభిప్రాయంను రవిచంద్రన్‌ వ్యక్తం చేశాడు.
Tags:    

Similar News