అతనో పెద్ద బిజినెస్ మ్యాన్. వందల..వేల కోట్లాధిపతి. వ్యాపార సామ్రాజ్యంలో! ఓ దిగ్గజంలో కొనసాగుతున్నాడు. కానీ అది అతని డ్రీమ్ కాదు. డబ్బు సంపాదన ఒక్కటే జీవితమనుకోలేదు. డబ్బుదేముంది? ఈ రోజు ఉంటుంది? రేపు పోతుంది? ఎంత సంపాదించిన వాడైనా! ఎలా బ్రతికిన వాడైనా! చివరికి అందరూ కలిసేది ఆ ఒక్కచోటులోనే.
ఏది సాధించాలన్నా సజీవుడిగా ఉన్నంత కాలమే సాధ్యం. ఆ జీవితం ఒరిగిన నాడు చేసేదేం? ఉండదు. అందుకే ఓ తమిళ వ్యాపార వేత్త ఇటీవలే తన డ్రీమ్ ని పుల్ ఫిల్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇటీవలే ఓ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నట్లు ప్రకటించారు. ఆ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు..తమిళ్ భాషలో ఆ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే ఆ సినిమా ఫంక్షన్ అతి రధమహారధుల సమక్షంలోగా ఎంతో గ్రాండ్ గా జరిగింది. కోలీవుడ్ టాప్ మేకర్స్ అంతా అతని కోసం దిగొచ్చారు. స్టార్ హీరోయిన్లు అంతా ఆ యువ హీరోని రౌండప్ చేసి వేదికని మరింత రంగుల మయం చేసారు. అతగాడి గురించి అంతా ఒకటే పొగడ్తల మూట.
ఆ సమయంలో అక్కడికి వచ్చిన ప్రతీ ఒక్కర్ని..ప్రతీ మాటని..పదాన్ని సైతం ఆ హీరో స్టడీ చేసాడు. డబ్బుంటే ఇలా ఉంటుందా? అని ఒక్కసారిగా మనసులో స్మరించుకున్నాడు. నేనో వ్యాపార వేత్తని..వీళ్లంతా పిలవగానే నా ఫంక్షన్ కి రావడం ఏంటి? నేనేమీ సెలబ్రిటీ ని కాదు కదా? అంతకు మించి పెద్ద అందగాడ్ని కాదు కదా? అని మనసులో మరోసారి నెమర వేసుకున్నాడు.
అతని అంతరాత్మ చెప్పంది నిజమే. హీరో అవ్వడానికి కొన్ని క్వాలిటీలు తప్పని సరి అన్నది చాలా మంది భావన. మంచి హైట్...వెయిట్..చూడటానికి అందంగా కనిపించడం..ఆకర్షణీయమైన లుక్ ఇలా కొన్ని విషయాలు తెరపై కనిపించే వారికి తప్పి సరి అనే భావన చాలా మంది లో ఉంది. అలాగని అందంగా ఉన్నవాళ్లే హీరోలు అవ్వాలని లేదు.
అలా లేని వాళ్లు చాలా మంది హీరోలు అయ్యారు. హీరోలైన వాళ్లంతా గొప్ప అందగాళ్లు అనీ కాదు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ని ముఖం అద్దంలో చూసుకున్నావా? అని కెరీర్ తొలి నాళ్లలో విమర్శించిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. `నీ హైట్ కి...నీ ఫేస్ కి` నువ్వు హీరో ఏంటని షారుక్ ఖాన్ ని ఆపీస్ గేట్ బయట నిలబెట్టిన రోజులున్నాయి. ఇప్పుడా ఇద్దరు బాలీవుడ్ పరిశ్రమనే ఏల్తున్నారు.
మరి డబ్బుండి అంత మంది ఉద్దండుల్ని రంగంలోకి దించిన అతగాడు హీరోగా సక్సెస్ అవుతాడా? లేదా? అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ డబ్బుంటే హీరో అవ్వొచ్చు అన్న మాటని ఆ యంగ్ హీరో మరోసారి రుజువు చేసాడు.