దేశ వ్యాప్తంగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చు అంటూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. చాలా సీరియస్ గైడ్ లైన్స్ తో కేంద్రం అనుమతులు ఇచ్చింది. పెద్ద సినిమాలకు 50 శాతం ఆక్యుపెన్సీ నష్టాలను మిగిల్చుతుందనే ఉద్దేశ్యంతో చిన్న సినిమాలు పాత సినిమాలు మాత్రమే విడుదల అవుతూ వస్తున్నాయి. తమిళనాట భారీ అంచనాలున్న మాస్టర్ సినిమాను ఈ సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకోసం తమిళనాడు ముఖ్యమంత్రిని మాస్టర్ యూనిట్ సభ్యులు కలిసి 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఒత్తిడులు మరియు రాజకీయ అవసరాల నిమిత్తం నూరు శాతం ఆక్యుపెన్సీకి అక్కడి తమిళ ప్రభుత్వం ఓకే చెప్పడం.. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమనడం జరిగిపోయింది. కేంద్రం ఆదేశాల మేరకు 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లుగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వం ఎలాగూ ఫుల్ పర్మీషన్ ఇచ్చింది కదా అని మాస్టర్ ఆగమేఘాల మీద పరుగులు పెడుతూ వస్తున్నాడు. ఇలాంటి సమయంలో మళ్లీ 50 శాతంకు ఆక్యుపెన్సీ తగ్గించారు. మరి మాస్టర్ ఆగుతాడా లేదంటే పర్వాలేదు అంటూ రిలీజ్ కు సిద్దం అవుతాడా అనేది చూడాలి. 50 శాతం ఆక్యుపెన్సీ అంటే ఖచ్చితంగా ఆర్థికంగా నష్టాలను కలిగించడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే చాలా కాలంగా వాయిదా పడుతున్న మాస్టర్ సినిమాను మళ్లీ వాయిదా వేసే పరిస్థితి ఉందా అంటే అనుమానమే అన్నట్లుగా తమిళ మీడియా వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. వంద కోట్లకు పైగా బిజినెస్ చేసిన 'మాస్టర్' మూవీ 50 శాతం ఆక్యుపెన్సీతో విడుదల అయితే పరిస్థితి ఏంటీ అనేది ఎవరు ఊహించలేక పోతున్నారు.