ముద్దుసీన్స్‌ తప్పేంకాదు.. వారిని బహిష్కరించాలి

Update: 2019-05-13 08:04 GMT
ఒకప్పుడు బాలీవుడ్‌ కే పరిమితం అయిన ముద్దు సీన్స్‌ ఇప్పుడు టాలీవుడ్‌ లో కూడా చాలా కామన్‌ అయ్యాయి. అర్జున్‌ రెడ్డి, ఆర్‌ ఎక్స్‌ 100 చిత్రాల తర్వాత చిన్న చిత్రాల్లో దాదాపు అన్నింటిలో కూడా ముద్దు సీన్స్‌ మరియు రొమాంటిక్‌ సీన్స్‌ ను పెడుతున్నారు. ఆ సీన్స్‌ ఉంటేనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలం అంటూ చిన్న చిత్రాల మేకర్స్‌ భావిస్తున్నారు. దాంతో అవసరం ఉన్నా లేకున్నా కూడా ముద్దు సీన్స్‌ మాత్రం పెట్టేస్తున్నారు. తాజాగా డిగ్రీ కాలేజ్‌ అనే చిత్రంలో ముద్దు సీన్స్‌ పెట్టడం జరిగింది. ఆ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ కు ముఖ్య అతిథిగా వెళ్లిన ఆమె ఆ చిత్ర యూనిట్‌ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సీన్స్‌ ఏంటీ అంటూ మండి పడింది.

తాజాగా సినిమాల్లో ముద్దు సీన్స్‌ విషయమై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ.. డిగ్రీ కాలేజ్‌ చిత్రాన్ని తీసిన దర్శకుడు నరసింహ నంది మంచి దర్శకుడు ఆయన తీసిన 1940 లో ఓ గ్రామం చిత్రం జాతీయ అవార్డును సైతం దక్కించుకుంది. అయితే ఆ సినిమా కలెక్షన్స్‌ ను తెచ్చి పెట్టలేదు. ఆ తర్వాత అతడు కలెక్షన్స్‌ తెచ్చి పెట్టాలనే ఉద్దేశ్యంతో కాస్త గ్లామర్‌ ను అద్దుతున్నాడు. తాజాగా ఈ చిత్రంలో కూడా కథ డిమాండ్‌ మేరకు ముద్దు సీన్స్‌ పెట్టి ఉంటాడు అని నేను భావిస్తున్నాను. అయితే ఇలాంటి సినిమాలు, ముద్దు సీన్స్‌ ఉన్న సినిమాల వేడుకలకు జీవిత వంటి వారిని ఆహ్వానించడం సరైన పద్దతి కాదని ఈ సందర్బంగా తమ్మారెడ్డి అన్నాడు.

కొన్ని సినిమాల కథలకు తప్పనిసరిగా ముద్దు సీన్స్‌, రొమాంటిక్‌ సీన్స్‌ అవసరం ఉంటాయి. కొన్ని సీన్స్‌ ను బెడ్‌ రూంలో కెమెరా పెట్టకుండా ప్రేక్షకులకు ఆ పాత్ర లేదా సీన్‌ యొక్క డెప్త్‌ ను తెలియజేయలేం. అలాంటి సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో ముద్దు సీన్‌ పెట్టాల్సి ఉంటుంది. ఆర్‌ ఎక్స్‌ 100 చిత్రంలో ముద్దు సీన్‌ ఖచ్చితంగా ఉండాలి. ఆ సీన్‌ కథకు చాలా కీలకం. అందులోని రొమాంటిక్‌ సీన్స్‌ కూడా కథకు కీలకం కనుక వాటిని మనం ఏమనలేం. వాటిని బూతు సినిమాగా పిలవకూడదు. కాని ఏ సినిమాల్లో అయితే అవసరం లేకున్నా కూడా ముద్దులు పెట్టడం, రొమాంటిక్‌ సీన్స్‌ పెడతారో వాటిని బూతు సినిమాలు అనవచ్చు. అలాంటి ఫిల్మ్‌ మేకర్స్‌ ను ఇండస్ట్రీ నుండి బ్యాన్‌ చేసినా తప్పులేదంటూ చెప్పుకొచ్చాడు. ఏదైనా అవసరం ఉన్నంత వరకు వినియోగిస్తే పర్వాలేదని తమ్మారెడ్డి అన్నాడు.
Tags:    

Similar News