ఇండస్ట్రీలో దర్శకులు, నిర్మాతలు ఒక్కొక్కరిగా మెల్లగా తమ వారసులను హీరోలుగా, హీరోయిన్లుగా లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అయినా సరే పరిచయం చేస్తున్నారు. అలా ఇప్పటికే చాలామంది తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్డం అందుకున్నారు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్ డెబ్యు చేయనున్నట్లు వార్తలు ముమ్మరం అయ్యాయి. ఇదివరకు అభిరామ్ డెబ్యూ గురించి గతంలోనే వార్తలొచ్చాయి. కానీ ఆ మధ్యలో మళ్లీ ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. కానీ గతేడాది స్వయంగా అభిరామ్ డెబ్యూ చేస్తున్నట్లు ప్రకటించాడు.
అప్పటినుండి అభిరామ్ సినిమా ఎప్పుడని ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇటీవలే యాక్టర్ కం డైరెక్టర్ రవిబాబు.. అభిరామ్ డెబ్యూ మూవీని తెరకెక్కిస్తాడని న్యూస్ వచ్చింది. అలాగే ఓ స్క్రిప్ట్ కూడా సురేష్ బాబుకు వినిపించినట్లు తెలిసింది. కానీ ఇంకా ఫైనల్ కాలేదట. ఇదిలా ఉండగా.. తాజాగా అభిరామ్ ను పరిచయం చేసేందుకు మరో డైరెక్టర్ లైన్ లోకి వచ్చినట్లు టాక్. ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త హీరోలను, ఆర్టిస్టులను పరిచయం చేసిన డైరెక్టర్ తేజ. అభిరామ్ సినిమాను తేజ డైరెక్ట్ చేస్తాడని అలాగే.. తను ప్లాన్ చేసిన చిత్రం సీక్వెల్.. 'చిత్రం 1.1' మూవీలో హీరోగా అభిరామ్ ను తీసుకోబోతున్నట్లు సినీవర్గాలలో చర్చలు మొదలయ్యాయి. మరి అధికారిక ప్రకటన రావాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే.