దాసరి నారాయణరావు లాంటి దర్శక దిగ్గజం అస్తమించింది. అలాంటి దర్శకుడు కానీ.. ఇండస్ట్రీపై అంతటి ప్రేమ కురిపించే ప్రేమమూర్తిని కానీ మరొకరిని చూడడం అసాధ్యం.. అసంభవం. కథ- స్క్రీన్ ప్లే- మాటలు- పాటలు- నిర్మాత-దర్శకత్వం ఇన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేయగల టైటిల్ కార్డ్.. బహుశా దాసరితోనే అంతం అయిపోతుంది కూడా. వీటికి తోడు ఇండస్ట్రీలోను 24 విభాగాలపై పట్టు ఉండి.. అందరి ప్రేమను గౌరవాన్ని పొందే దాసరికి.. ఇండస్ట్రీ నుంచి కనీస మాత్రం నివాళులు కూడా దక్కడం లేదు.
ఆయన అంత్యక్రియలకు రాకపోవడం సంగతి పక్కన పెట్టేసినా.. కనీసం వీడియో బైట్స్ ద్వారా కూడా చాలామంది దాసరికి నివాళులు అర్పించలేకపోతున్నారు. కనీసం దాసరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని.. తెలుగు సినీ పరిశ్రమ గురువును కోల్పోయిందని అన్న వారు కూడా.. ఆ రోజుతోనే దాసరిని విస్మరించేశారా అనిపించక మానదు. కనీసం సంతాప దినాలు కూడా పాటించడం లేదు. 24 ఫ్రేమ్స్ లోని ఒక్కో విభాగం ఒక్కో రోజు సంతాప దినం పాటించినా.. 24 రోజుల పాటు ఆయనకు గౌరవాన్ని ఇచ్చినట్లు అయ్యేది.
సహజంగా ఇంతటి దిగ్గజం మరణిస్తే 11 రోజులైనా సంతాప దినాలు పాటించడం ఆనవాయితీ. కానీ దాసరికి ఆ గౌరవాన్ని ఇవ్వాలనే విషయాన్ని మరిచిపోయింది టాలీవుడ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/