దీపావళికి కూడా అదే యుద్దం!!

Update: 2016-10-17 22:30 GMT
ఏమయ్యా.. కావాలంటే అందరూ ఒకేసారి ధియేటర్లలోకి వచ్చి యుద్దం చేసుకోండి.. అబ్బే అది మాత్రం చేయం. ప్రస్తుతం తెలుగు హీరోల పరిస్థితి ఇలాగే ఉంది. ఎవరికివారు సోలో రిలీజ్ డేట్ కోసమే చూస్తున్నారు. పక్కనే ఏదన్నా పెద్ద సినిమా ఉంటే మినిమం రెండు వారాల గ్యాప్ మెయిన్టయిన్ చేస్తున్నారు. అందుకే జనాలు కూడా వీరిని యుద్దానికి రావట్లేదని కామెంట్లు చేస్తుంటే.. వీరు మాత్రం ఆ యుద్దమేదో ఆన్ లైన్లో చూస్కుందాం అంటున్నారు.

అవును మొన్న దసరా నాడు చూశాంగా.. ఒకేరోజు శతమానం భవతి టీజర్.. అలాగే గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్.. అలాగే ధృవ టీజర్ రిలీజయ్యాయ్. ఈ టీజర్ ఎలా ఉంది ఆ టీజర్ ఎలా ఉంది.. మా టీజర్లో గట్స్ ఉన్నాయ్ మీ టీజర్లో లుక్స్ ఉన్నాయ్.. అంటూ జనాలు చెవులు కొరికేసుకున్నారు. యుద్దాలు చేసేసుకున్నారు. ఇప్పుడు దసరా టీజర్ల యుద్దం అయిపోయాక సేమ్ టు సేమ్ దీపావళికే కూడా అదే చేద్దాం అని టాలీవుడ్ ఫిక్సయ్యింది. ఆల్రెడీ మహేష్‌ అండ్ మురుగుదాస్ సినిమా టీజర్ వస్తుందని రూమర్లు ఉన్నాయ్. వెంకటేష్‌ గురు సినిమా టీజర్ వస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. వీటితోపాటు గోపిచంద్-నయనతార సినిమా (చాలా రోజులుగా ఆగిపోయిన సినిమా) ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారట. టైటిల్ ను ప్రకటించి.. ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రిలీజ్ చేసే ఛాన్సుంది.

సో.. ఇకమీదట తెలుగులోగిళ్లలో పండగ వస్తుందంటే చాలు.. మనోళ్ళు టీజర్లను పంపేసి యుద్దం ప్రకటిస్తారనమాట. సర్లేండి.. అదే సమయానికి ఒక ప్రక్కన ధియేటర్లలో సినిమాలు రీలీజవ్వడం మరో ప్రక్కన టీజర్లు ఆన్ లైన్లో హంగామా చేయడం.. తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టయిన్మెంట్!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News