జరుగుతున్నది చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తనని తాను చాలా ఎక్కువగా ఊహించుకుని సినిమా ఫంక్షన్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వం పైనే కాకుండా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి, మంత్రి పేర్ని నానిపై నోటికొచ్చింది మాట్లాడిన విషయం తెలిసిందే. గంటసేపు పవన్ మాట్లాడినా అందులో వాస్తవాలు దాదాపు లేవనే చెప్పాలి. ఏదో అక్కసుతోనే ప్రభుత్వంపై పవన్ బురద చల్లినట్లు, ఓ అజెండా ప్రకారమే జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లే చాలామంది అనుమానిస్తున్నారు.
సరే దాని తర్వాత మంత్రులు, వైసీపీ ఎంఎల్ఏలు అంతేస్థాయిలో పవన్ పై మాటలతో ఎదురుదాడికి దిగారు. ఇదంతా సహజమే అనుకున్నా సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కు మద్దతుగా ఎవరు మాట్లాడకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. పైగా బహిరంగంగా ఇప్పటివరకు మాట్లాడిన వారంతా పవన్ను తప్పుపడుతూ మాట్లాడారు. మొదటగా ఏపీ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ తరపున ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. అందులో పవన్ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని కాబట్టి చాంబర్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చేసింది.
తర్వాత మాట్లాడిన మంచు విష్ణు మీడియా సమావేశంలోనే పవన్ వ్యాఖ్యలను ఖండించారు. ఆ తర్వాత పోసాని కృష్ణమురళి మాట్లాడుతు పవన్ వ్యాఖ్యలను తప్పుపడుతూ తారా స్థాయిలో విరుచుకుపడ్డారు. పోసాని మాట్లాడిన దాంట్లో కూడా అసందర్భమైన ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజాగా అక్కినేని నాగార్జున ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారు. పవన్ వ్యాఖ్యలను నాగార్జున ఎక్కడా ప్రస్తావించకపోయినా ప్రభుత్వానికి డైరెక్టుగానే మద్దతుగా మాట్లాడారు.
ప్రభుత్వానికి డైరెక్టుగా మాట్లాడారు కాబట్టి పవన్ వ్యాఖ్యలను పరోక్షంగా వ్యతిరేకిస్తున్నట్లే భావించాలి. ఫైనల్ గా నిర్మాత దిల్ రాజు కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. సినిమా టికెట్లను ఆన్ లైన్లో అమ్మే ప్రక్రియను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. ఈ ప్రక్రియ వల్ల తనలాగ రెగ్యులర్ గా సినిమాలుతీసే నిర్మాతలకు ఎంతో ఉపయోగమన్నారు.
‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న విష్ణు బహిరంగంగానే పవన్ వ్యాఖ్యలను ఖండించినా ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతూ ఎవరూ మాట్లాడలేదంటే పరోక్షంగా మిగిలిన వాళ్ళు మద్దతిస్తున్నట్లే అనే ప్రచారం పెరిగిపోతోంది. మా ఎన్నికలైపోయిన తర్వాత పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తానని మోహన్ బాబు చెప్పారు. ఈయన కూడా పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశముంది.
వీటన్నింటినీ పక్కన పెట్టేసినా పవన్ వ్యాఖ్యలకు మద్దతుగా చిరంజీవి కుటుంబం నుంచి మద్దతుగా ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. చివరకు జనసేన లో ఉన్న సోదరుడు నాగబాబు కూడా నోరెత్తకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. పవన్ను ఎవరైనా ఏమన్నా అంటే నాగుబాబు రెచ్చిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. అలాంటిది ఇపుడు పవన్ కు మద్దతుగా నాగబాబు కూడా ఎందుకు మాట్లాడటం లేదు ? సో జరుగుతున్నది చూస్తుంటే ఇండస్ట్రీలో పవన్ ఒంటరయ్యారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.