అన్నగారిపై థమన్ పాట.. జోహార్ ఎన్టీఆర్

Update: 2022-05-28 16:30 GMT
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నటికీ మరువలేనిది అతి కొద్ది మంది ప్రముఖ నటుల లో శ్రీ నందమూరి తారకరామారావు గారు ఒకరు. ఆయన ఎలాంటి సినిమాలు చేసినా కూడా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త సందడి నెలకొనేది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఎన్నో ప్రయోగాత్మకమైన సినిమాలు చేసిన అన్నగారు జన్మించి నేటికి వంద సంవత్సరాలు పూర్తయింది. ఇక ఈ జయంతి వేడుకలను అభిమానులు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకొంటున్నారు.

అంతే కాకుండా సినీ ప్రముఖులు కూడా వారికి నచ్చిన విధానంలో అన్నగారికి నివాళులర్పించారు. ఇక సంగీత దర్శకుడు థమన్ కూడా మరొకసారి తన అద్భుతమైన మ్యూజిక్ తో ఎన్టీఆర్ ఘనమైన నివాళి అర్పించారు.

ఎన్టీఆర్ కి ట్రైబ్యుటీ గా జోహార్ ఎన్టీఆర్ అనే పాటను కంపోజ్ చేసిన తమన్ తన మ్యూజిక్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. నేటి తరం వారికి కూడా ఆయన గొప్పతనం తెలిసేలా రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాసిన విధానం కూడా అద్భుతంగా ఉంది.

నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా ఈ పాటను సమర్పించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సంగీత దర్శకుడు తమన్ నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న  సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ట్యూన్స్ అన్నీ కూడా రెడీ అయ్యాయి.

ఇక థమన్ పనితనాన్ని మరోసారి మెచ్చుకున్న బాలకృష్ణ ఏకంగా ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా పాటను కంపోజ్ చేసే అవకాశం ఇచ్చాడు. థమన్ కూడా ప్రేక్షకులు కేవలం ఆస్వాదించే విధంగానే కాకుండా స్టెప్పులు వేసే విధంగా కూడా  మ్యూజిక్ అందించడం విశేషం.

పాట మాత్రం చాలా అద్భుతంగా ఉంది అంటూ ప్రేక్షకులు అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఉదయాన్నే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అలాగే మరికొందరు సినీ ప్రముఖులు ఎన్టీఆర్ ఘనంగా నివాళులర్పించారు. రామ్ చరణ్ కూడా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ మహా నటుడు గొప్ప వ్యక్తి అంటూ ట్వీట్ చేశాడు.


Full View

Tags:    

Similar News