ఎస్.ఎస్.థమన్ ఇస్పీడ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగిపోయింది. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అతడి రేంజునే మార్చేసింది. అప్పటివరకూ రొటీన్ ట్యూన్స్ తో విసిగించిన థమన్ కొంత ఫ్రెష్ నెస్ కలిగిన బాణీలతో ఆకట్టుకున్నాడన్న ప్రశంసలు దక్కాయి. అల.. పాటలకు శ్రోతల నుంచి అద్భుత స్పందన వచ్చింది. యూట్యూబ్ .. సోషల్ మీడియాలో అద్భుత ఆదరణను దక్కించుకున్నాయి.
ఇక ఇదే ఊపులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా `లాయర్ సాబ్`కి పని చేసే అవకాశం దక్కించుకున్నాడు. పవన్ తో తొలి అవకాశమిది. దీంతో అతడి హడావుడి కూడా మామూలుగా లేదు. తొందర్లోనే తొలి సింగిల్ రిలీజ్ కి పీఎస్ పీకే 26 టీమ్ ప్రిపరేషన్ లో ఉంది. ఆ క్రమంలోనే థమన్ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ బోలెడంత రచ్చ చేస్తున్నాడు. అగ్ర హీరోల్లో పవన్ తో రాకరాక అవకాశం రావడం వల్ల అతడిలో జోష్ మరీ ఎక్కువైందన్న మాట వినిపిస్తోంది
అయితే మరీ ఇలా సెల్ఫ్ భజన ఎక్కువైతే ఉన్నది కాస్తా పోగొట్టుకోవాల్సి ఉంటుందేమో. ఓవర్ భజన వల్ల మూవీ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుందన్న విమర్శలు పవన్ అభిమానుల్లో వినిపిస్తున్నాయి. థమన్ కాస్త డీసెంట్ గా ఎప్రోచ్ అయితేనే బావుంటుందేమోనని సూచిస్తున్నారు. అల వైకుంఠపురములో చార్ట్ బస్టర్ ఆల్బమ్ విన్న శ్రోతలకు మళ్లీ ఆ రేంజు తగ్గకుండా ఆల్బమ్ ఇచ్చి సత్తా చాటాలని కోరుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ `లాయర్ సాబ్`(PSPK 26 )ని దిల్ రాజు- బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2020లో థమన్ ఈ క్రేజీ సినిమాతో పాటు మరో అరడజను ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.