తెలుగు తెరపై నటన పరంగానే కాదు .. నాట్యం పరంగాను ఆకట్టుకున్న కథానాయికలలో భానుప్రియ ఒకరు. విశాలమైన కళ్లతో భానుప్రియ నవరసాలను ఆవిష్కరించిన తీరును ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. 'సితార' సినిమాతో భానుప్రియను దర్శకుడు వంశీ పరిచయం చేశారు. తెరపై ఆమెను చూసినవాళ్లు .. ఇంతటి ఆకర్షణీయమైన కళ్లను ఇంతవరకూ చూడలేదనే అనుకున్నారు. అయితే అంత త్వరగా ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. భానుప్రియ కథానాయికగా కాలు పెట్టిన దగ్గర నుంచి ఆమె గట్టిపోటీని ఎదుర్కోవలసి వచ్చింది.
విజయశాంతి .. రాధ .. సుహాసిని వంటి కథానాయికలు మంచి జోరుమీద ఉన్నారు. విజయశాంతి .. రాధ ఇద్దరూ కూడా గ్లామర్ పరంగాను .. డాన్సుల పరంగాను తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ల ధాటిని తట్టుకుని భానుప్రియ నిలబడటానికి కారణం, ఆమెకి క్లాసికల్ డాన్స్ లో మంచి ప్రవేశం ఉండటమనే చెప్పాలి. ఈ కారణంగానే ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. అలాంటి భానుప్రియ గురించి తాజాగా పరుచూరి గోపాలకృష్ణ, 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడారు.
"ఒకప్పుడు తెలుగు తెరపై శ్రీదేవి .. జయసుధ .. జయప్రద స్టార్ హీరోయిన్లుగా కొనసాగారు. ఆ తరువాత విజయశాంతి .. రాధ .. భానుప్రియ అదే తరహాలో ముందుకు సాగారు. భానుప్రియను నేను నాట్యమయూరి అంటాను. చిరంజీవిగారితో సమానంగా రాధ తప్ప మరెవరూ డాన్స్ చేయలేరని మొన్న ఎవరో అన్నారు. ఈ విషయంలో నా అభిప్రాయం వేరు. 'భానుప్రియ గారితో డాన్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి' అని చిరంజీవిగారే అంటూ ఉండేవారు. ఆమె మంచి డాన్సర్ అని ఆయన నమ్మేవారు. 'స్టేట్ రౌడీ' సినిమా చూస్తే ఈ విషయం మీకు అర్థమైపోతుంది.
భానుప్రియ గారి శరీరంలోనే నాట్యం ఉందని నేను నమ్ముతూ ఉంటాను. ఆమెతో మేము చేసిన 'అనసూయమ్మగారి అల్లుడు' సినిమా గొప్పగా ఆడింది. ఆమెతో మా మొదటి సూపర్ హిట్ సినిమా ఇది. ఈ సినిమాలో ఆమె నటన .. డాన్స్ అద్భుతంగా ఉంటాయి. ఆ తరువాత 'ప్రెసిడెంటుగారి అబ్బాయి' సినిమాలో కూడా ఆమెనే అనుకున్నాము. కానీ ఆ పాత్రకి దగ్గరగా ఉన్న మరో పాత్రలో ఆమె ఆల్రెడీ చేస్తున్నందు వలన ఈ సినిమా చేయలేకపోయారు. 'స్వర్ణకమలం' సినిమాలో ఆమె ఎంత గొప్పగా నటించారో .. అంతే గొప్పగా నర్తించారు. అంత గొప్ప నటి దొరకడం తెలుగు ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం" అని చెప్పుకొచ్చారు.