కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ''ది ఘోస్ట్''. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది. దసరా సందర్భంగా రిలీజ్ కాబోతోన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. వరుస అప్డేట్స్ తో మేకర్స్ క్యూరియాసిటీని పెంచుతున్నారు.
ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ మరియు థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇది పవర్ ఫుల్ యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని హామీ ఇచ్చింది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా 'వేగం' అనే ఫస్ట్ సింగిల్ ని విడుదల చేశారు.
'నీలి నీలి సంద్రం.. నింగిలోని మేఘం.. నిన్ను చేరమందీ.. అంతిలేని వేగం..' అంటూ సాగిన ఈ పాట సినిమాలోని రొమాంటిక్ సైడ్ ని చూపుతుంది. ఇందులో నాగార్జున మరియు సోనాల్ చౌహాన్ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. నాగ్ సూపర్ స్టైలిష్ గా కనిపించగా.. సోనాల్ హాట్ గా ఉంది. ఇద్దరి మధ్య ఇంటిమేట్ రొమాన్స్ మరియు మంచి కెమిస్ట్రీని చూడొచ్చు.
భరత్ - సౌరబ్ ద్వయం ఈ రొమాంటిక్ మెలోడీకి ట్యూన్ కంపోజ్ చేశారు. కపిల్ కపిలన్ మరియు రమ్య బెహరా కలిసి ఆలపించారు. కృష్ణ మాదినేని తన సంభాషణ శైలి సాహిత్యంతో అదరగొట్టాడు. విజువల్ గానూ 'వేగం' గీతం ఆకట్టుకుంటుందని లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతుంది.
'ది ఘోస్ట్' సినిమాలో ఇంటర్ పోల్ ఆఫీసర్ విక్రమ్ గా నాగార్జున కనిపించనున్నారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా.. గుల్ పనాగ్ - అనిఖా సురేంద్రన్ - జయప్రకాష్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్ మోహన్ రావు - శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
మార్క్ కె రాబిన్ ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ అందించగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. దినేష్ సుబ్బరాయన్ మరియు కేచా మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.
'ది ఘోస్ట్' చిత్రాన్ని అక్టోబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అయితే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. 'పుష్ప' చిత్రాన్ని బాలీవుడ్ లోకి తీసుకెళ్లిన గోల్డ్ మైన్స్ మనీష్ ఈ మూవీ హిందీ రైట్స్ డీల్ గురించి చర్చిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.