ఏకంగా హాలీవుడ్‌ నుండే దింపుతున్న ఆ హీరో

Update: 2022-02-14 07:15 GMT
తమిళ ట్యాలెంటెడ్‌ హీరో శివ కార్తికేయన్ బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలతో దూసుకు పోతున్నాడు. ఈ సమయంలో ఆయనతో సినిమాను చేసే అవకాశంను మన జాతి రత్నాలు చిత్ర దర్శకుడు అనుదీప్ దక్కించుకున్నాడు. వీరిద్దరి కాంబో అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అయ్యింది. ఆమద్య పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తుంది.

ఎట్టకేలకు ఈ సినిమా ను పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్ సినిమా ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ కు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమా లో కథానుసారంగా ఒక విదేశీ బ్యూటీ నటించాల్సి ఉందట. అందుకోసం ఈ సినిమాలో ఉక్రెయిన్‌ బ్యూటీ మరియా ర్యాబోశాప్క ను నటింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై అతి త్వరలోనే శివ కార్తికేయన్ టీమ్‌ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

శివ కార్తికేయన్ కథల ఎంపిక విషయంలో చాలా కొత్తగా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే ఈయనకు బ్యాక్ టు బ్యాక్‌ సక్సెస్ లు దక్కుతున్నాయి. గత ఏడాది డాక్టర్ సినిమా తో ఈయన సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా కరోనాను కూడా లక్ష్య పెట్టకుండా భారీగా వసూళ్లను దక్కించుకుంది. తమిళంలోనే కాకుండా తెలుగు మరియు హిందీలో కూడా డాక్టర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా కారణంగా శివ కార్తికేయన్ కు మంచి మార్కెట్‌ తెలుగు లో కూడా క్రియేట్‌ అయ్యింది. ఇప్పుడు ఆయన అనుదీప్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. అందుకే బడ్జెట్‌ ఎక్కువైనా పర్వాలేదు అనే ఉద్దేశ్యంతో విదేశీ బ్యూటీని సినిమా కోసం ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.

సౌత్‌ హీరోలు బాలీవుడ్‌ హీరోయిన్స్ తో నటిస్తూనే గొప్పలు చెప్పుకుంటూ ఉంటే శివ కార్తికేయన్ ఏకంగా హాలీవుడ్‌ బ్యూటీని దించబోతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో హడావుడి చేస్తున్నారు. శివ కార్తికేయన్‌ ముందు ముందు పాన్ ఇండియా స్టార్‌ గా మరింత పేరును సంపాదించుకోవడం ఖాయం అనే అభిప్రాయంను నెటిజన్స్ మరియు తమిళ సినీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాజమౌళి తన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా లో ఒక పాత్ర కోసం హాలీవుడ్ బ్యూటీని తీసుకున్నాడు. మళ్లీ ఇప్పుడు శివ కార్తికేయన్ సినిమా లో ఒక హాలీవుడ్‌ బ్యూటీ నటించబోతుంది. సౌత్ సినిమాల స్థాయి పరిధి పెరిగింది అనేందుకు ఇంతకు మించిన సాక్ష్యం అక్కర్లేదు. ముందు ముందు మరింత మంది హాలీవుడ్‌ స్టార్స్ సౌత్‌ సినిమాల్లో ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


Tags:    

Similar News