పెట్టుబడి కి 15 రెట్ల లాభం రాబట్టిన మూవీ

Update: 2019-11-11 09:38 GMT
హాలీవుడ్‌ మూవీస్‌ అనగానే అంతా కూడా ఠక్కున యాక్షన్‌ సినిమా లే అనుకుంటరు. అవెంజర్స్‌.. స్పైడర్‌ మ్యాన్‌ ఇలా యాక్షన్‌ సినిమాలకే ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపు ఉంది. కాని మొదటి సారి ఒక కామెడీ సినిమా రికార్డు స్థాయి వసూళ్ల ను రాబట్టింది. 1 బిలియన్‌ డాలర్లకు సమీపం లోకి హాలీవుడ్‌ మూవీ 'జోకర్‌' వచ్చింది. గత అయిదు వారాలుగా వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంకా కూడా పలు దేశాల్లో ఈ చిత్రం వసూళ్ల పరం గా కుమ్మేస్తోంది.

ఈ సినిమా గురించి అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన ఫోర్బ్స్‌ ఒక కథనం లో పేర్కొనడం జరిగింది. ఫోర్బ్స్‌ కథనం ప్రకారం ఇండియాలో జోకర్‌ చిత్రం 50 కోట్లకు పైగా వసూళ్ల ను రాబట్టింది. ఇండియాలో కాస్త తక్కువే అయినా ప్రపంచ దేశాల్లో మాత్రం ఈ చిత్రం వసూళ్లు భారీగా ఉన్నాయి. అయిదు వారాల్లో ఈ చిత్రం 953 మిలియన్‌ డాలర్లను అంటే ఇండియన్‌ కరెన్సీ ప్రకారం 6816 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది.

ఫోర్బ్స్‌  కథనం ప్రకారం 62.5 మిలియన్‌ డాలర్లు అంటే 446.1 కోట్ల రూపాయలతో ఈ చిత్రం తెరకెక్కిందట. పెట్టుబడికి ఏకంగా 15 రెట్ల లాభం ఇప్పటి కే వచ్చింది. ఇంకా కూడా ఈ సినిమా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. బిలియన్‌ డాలర్ల రికార్డు కు కేవలం 47 మిలియన్‌ ల దూరంలో ఈ చిత్రం ఉంది. ప్రస్తుతం ట్రెండ్‌ చూస్తుంటే సినిమా ఏకంగా 100 మిలియన్‌ ల వరకు వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా లో కథనాలు వస్తున్నాయి. హాలీవుడ్‌ కు చెందిన ఒక కామెడీ సినిమా ఈ స్థాయి లో వసూళ్లను రాబట్టడం ఇదే కావచ్చు.
Tags:    

Similar News