బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా మారి ఎన్నో ఏళ్ళు అయినా విజయాలు అందుకున్నా దక్కని క్రేజ్, ఇమేజ్ ఒక్క అర్జున్ రెడ్డి రీమేక్ తో షాహిద్ కపూర్ కి వచ్చాయి. కబీర్ సింగ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. ౩౦౦ కోట్లకు పైగా వసూళ్ళు సాధించి ఔరా అనిపించింది. హిట్లు లేక మొఖమాచిన షాహిద్ కపూర్ క్రేజ్ ని ఈ సినిమా అమాంతం పైకి లేపింది. దీంతో తన తర్వాతి సినిమాను కూడా షాహిద్ ఆచితూచి సెలెక్ట్ చేసుకున్నాడు. మరో సారి తెలుగు రీమేక్ నే చేసేందుకు ఎంచుకున్నాడు. తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ మెలో డ్రామా జెర్సీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నానికి గొప్ప పేరు తేవడమే కాక కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. తొలి సినిమా అయినా గౌతమ్ తిన్ననూరి క్రికెట్ నేపథ్య కథని చక్కగా తెరకెక్కించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
ఈ సినిమాపై మనసు పడ్డ షాహిద్ కపూర్ హిందీలో దానిని రీమేక్ స్టార్ట్ చేసారు. దర్శకుడిగా గౌతమ్ నే ఎంచుకున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా షాహిద్ కపూర్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. కేవలం 47రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని , అది కూడా కరోనా పరిస్థితుల్లో ఇంత వేగంగా పూర్తవడం ఆశ్చర్యంగా ఉందని తెలిపాడు. ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్లు అందరి అంకిత భావంతోనే ఇది సాధ్య మైందని షాహిద్ కృతజ్ఞత లు తెలియజేసాడు. ఒక చక్కటి సినిమాలో నటించేందుకు తనకు అవకాశం దక్కడం గర్వంగా ఉందన్నాడు.
జెర్సీ సినిమా తెలుగులో లాగే హిందీలో కూడా ఒక స్ఫూర్తి నిచ్చే కథగా మిగులుతుందని, తనకు ఆ నమ్మకం ఉందని షాహిద్ పేర్కొన్నాడు. జెర్సీ తన సినీ ప్రయాణంలో ఒక మధుర జ్ఞాపకంలా మిగిలి పోతుందని తెలిపాడు. ఈ సినిమా వేగంగా పూర్తి అయ్యేందుకు ఎంతో మంది రిస్క్ చేసారని, వారితో పాటు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాత దిల్ రాజుకు షాహిద్ ధన్యవాదాలు తెలిపాడు. తెలుగులో ఒక క్లాసిక్ సినిమాగా జెర్సీ పేరు తెచ్చుకుంది. కబీర్ సింగ్ తర్వాత జెర్సీ కూడా తనకు చక్కటి విజయం అందిస్తుందని షాహిద్ ఆశలు పెట్టుకున్నాడు.