అక్కినేని హీరో నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మజిలీ-బంగార్రాజు- లవ్ స్టోరి లాంటి వరస హిట్లతో అతడిలో దూకుడు మరింత పెరిగింది. ప్రస్తుతం చైతన్య నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
వీటిలో థాంక్యూ స్ట్రెయిట్ తెలుగు సినిమా. లాల్ సింగ్ చడ్డా హిందీ సినిమా. ఈ చిత్రం తెలుగు-తమిళంలోనూ అనువాదమై విడుదలవుతోంది. అందువల్ల చైతన్య ఇకపై పూర్తిగా ప్రమోషన్స్ తోనే పూర్తి సమయం గడపాల్సి వస్తోంది. థాంక్యూ ఈనెల 22న విడుదలవుతోంది. ఇప్పటికే చైతన్య ప్రమోషన్స్ ని ముగించాడు. లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11న విడుదల కానుంది. కాబట్టి కంటిన్యూషన్ ప్రమోషన్స్ తో అతడు బిజీగా ఉంటాడు.
అయితే నాగచైతన్య ఆ ప్రశ్నను ఎలా తప్పించుకుంటున్నాడు? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్థానిక మీడియాని ఎలాగోలా మ్యానేజ్ చేయగలిగినా కానీ జాతీయ మీడియాని మ్యానేజ్ చేయడమెలా? అంటే.. ఇది చాలా కష్టతరమైనది.
ఇంతకుముందు బంగార్రాజు విడుదల సమయంలో సమంతతో నాగచైతన్య బ్రేకప్ గురించి ప్రశ్నించకుండా స్థానిక మీడియాని ఆపగలిగారు కానీ జాతీయ మీడియాని ఆపలేకపోయారు. అక్కడి నుంచి వచ్చిన వార్తలనే ఇక్కడా ప్రచురించారు.
ఇక ఇటీవల సమంత నుంచి విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి కారణం అందాల కథానాయిక శోభిత ధూళిపాలతో నాగచైతన్య ఎఫైర్ అని కూడా మీడియాలో కథనాలొచ్చాయి. అయితే వీటన్నిటిపైనా స్థానిక మీడియా థాంక్యూ ఇంటర్వ్యూల్లో ప్రశ్నించకుండా మేనేజ్ చేశారని గుసగుస వినిపిస్తోంది. అలాగే జాతీయ మీడియాకు కూడా చిక్కకుండా చై బృందం ఆపగలిగిందట.
కానీ నాగచైతన్య ఇకపై 'లాల్ సింగ్ చడ్డా' ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది. అటు బాలీవుడ్ మీడియాలో ఇంకా చాలా మ్యానేజ్ చేయాలి. ఆ రెండు ప్రశ్నల్ని అడగకుండా ఆపడం అంత సులువేమీ కాదు.. కానీ తప్పదు. మీడియాలో ఇలాంటి ఎఫైర్ గురించి ప్రశ్నలను అడిగేవారిని ఆపడమెలా అన్నదే అసలైన టెక్నిక్. దానిని ఇప్పటివరకూ సరిగానే ఫాలో చేసినా ఇంకా అలాంటిది ఎదుర్కోవాల్సి ఉంటుంది.