కేరళ సినీ ప్రియులు ఎన్నో ఏళ్లుగా ఐమాక్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించి కేరళలో తొలి ఐమాక్స్ థియేటర్ తిరువనంతపురం లో ఏర్పాటైంది. లులు మాల్ లోని పీవీఆర్ సూపర్ పెక్స్ లో ఐమాక్స్ స్క్రీనింగ్ థియేటర్ ను హాలీవుడ్ చిత్రం ' అవతార్ ది వే ఆఫ్ వాటర్' తో ప్రారంభించారు.
ఈ ఐమాక్స్ థియేటర్ ను తొలుత డిసెంబర్ 16న 'అవతార్ 2' రిలీజ్ రోజునే విడుదల చేయాలని భావించారు. అయితే అనివార్య కారణాలతో ' అవతార్ ది వే ఆఫ్ వాటర్' చిత్రాన్ని ఐమాక్స్ లో ప్రదర్శించారు. అయినప్పటికీ థియేటర్ ప్రారంభమైన తొలిరోజు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.
ఐమాక్స్ లో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. ఇందులో టికెట్ ధరలు రూ.1230 రూ. 930.. రూ. 830. కేరళలో ప్రారంభమైన ఐమాక్స్ థియేటర్ల దేశంలోనే 22వదిగా గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఐమాక్స్ థియేటర్ల ప్రారంభానికి ముందే ఐమాక్స్ ఆసియా థియేటర్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రీతమ్ తిరువనంతపురం.. కొచ్చిలను సందర్శించారు.
తిరువనంతపురంలోని లులు మాల్ లో ఐమాక్స్ కార్యకలాపాలకు అనువుగా ఉందని తెలియజేశారు. అలాగే కొచ్చిలోనూ ఐమాక్స్ సాధ్యసాధ్యాలను పరిశీలించారు. ఇందులో భాగంగా సెంటర్ స్క్వైర్ మాల్ లోని సినీ పోలీస్.. లులు మాల్ లోని పీవీఆర్ లను సందర్శించారు. కొచ్చి కూడా ఐమాక్స్ కార్యకలాపాలకు అనువుగా ఉన్న నగరమని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే అవతార్ ది వే ఆఫ్ వాటర్ ప్రపంచ సినిమా చరిత్రలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. డిసెంబర్ 2009లో విడుదలైన ఈ మూవీ 2019లో విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ తో రెండో స్థానానికి చేరుకుంది.
ఇక అవతార్ 2 కు ముందు అవతార్ తొలి పార్ట్ 2021లో ప్రపంచవ్యాప్తంగా రీ రీలీజు అయింది. ఉత్తమ కలెక్షన్లు సాధించి అవతార్ అల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్స్ మళ్లీ మొదటి స్థానంలో నిలిచింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.