మెగా స్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచి పోయిన ఆచార్య ఏ క్షణంలో అయినా ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని కొరటాల శివ భావిస్తున్నాడు. మరో వైపు చిరంజీవి తదుపరి సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లూసీఫర్ ను ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్బంగా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. సెకండ్ వేవ్ వచ్చి ఉండకుంటే చిరు బర్త్ డే వరకు లూసీఫర్ రీమేక్ టీజర్ లేదా ట్రైలర్ వచ్చి ఉండేది. కాని ఆ రోజున మొదలు పెట్టాల్సి వస్తోంది.
తమిళ దర్శకుడు మోహన రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ తెరకెక్కబోతుంది. ఎన్వీ ప్రసాద్ నిర్మాణంలో ఈ రీమేక్ రూపొందబోతుంది. చరణ్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. లూసీఫర్ లో మోహన్ లాల్ పాత్ర ను చాలా ఇష్టపడ్డ చిరంజీవి ఆ పాత్రలో నటించాలనే ఉద్దేశ్యంతో రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యాడు. అయితే మలయాళ లూసీఫర్ కు తెలుగు లో రాబోతున్న లూసీఫర్ కు చాలా తేడా ఉంటుందట. ఇప్పటికే పలు మార్పులు చేర్పులు చేయడంతో పాటు స్క్రిప్ట్ ను పూర్తి కమర్షియల్ గా మార్చేశారట.
ఒరిజినల్ లూసీఫర్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. కాని తెలుగు లూసీఫర్ లో మాత్రం హీరోయిన్ నుండి మొదలుకుని కామెడీ వరకు పలు రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించబోతున్నట్లుగా తెలుస్తోంది. లూసీఫర్ లో కీలక పాత్రకు గాను సీనియర్ హీరోయిన్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే లూసీఫర్ రీమేక్ పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.