సైరా శాటిలైట్ ఇదండీ క్లారిటీ

Update: 2019-10-01 08:41 GMT
మెగాస్టార్ చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ బుధ‌వారం(అక్టోబ‌ర్ 2న‌) రిలీజ‌వుతోంది. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ లో  ఉత్కంఠ అంత‌కంత‌కు పెరుగుతోంది. సైరా ఎలాంటి ఫ‌లితం అందుకోనుంది అన్న స‌స్పెన్స్ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ప్రీరిలీజ్ బిజినెస్ స‌హా శాటిలైట్ వ్యాపారానికి సంబంధించి ఆస‌క్తిక‌ర సంగ‌తులు వాస్త‌వాలు వెల్ల‌డ‌య్యాయి. సైరా ప్రీరిలీజ్ బిజినెస్ 150 కోట్ల మేర సాగింద‌ని ఒరిజిన‌ల్ లెక్క‌లు బ‌య‌టికి వ‌చ్చాయి.

తాజాగా సైరా శాటిలైట్ హ‌క్కుల్లోనూ అస‌లు వాస్త‌వం రివీలైంది. శాలిలైట్ రైట్స్ ని కొనుక్కున్న‌ చానెల్ వాళ్లు స్వ‌యంగా ఎంత‌కు కొన్నారో ప్ర‌క‌టించారు. సైరా శాటిలైట్ ని జెమిని చానెల్ వాళ్లు చేజిక్కించుకున్నారు. నిర్మాత రామ్ చ‌ర‌ణ్ భారీ మొత్తాన్ని డిమాండ్ చేయ‌డంతో చాలా చానెళ్లు వెన‌క్కి వెళితే జెమిని కాస్త డేర్ చేసి చేజిక్కించుకుందిట‌. తెలుగు-త‌మిళం-మ‌ల‌యాళం వ‌ర‌కూ  హ‌క్కుల్ని ఈ చానెల్ చేజిక్కించుకుంది. కేవ‌లం శాటిలైట్ కోసం 25కోట్లు జెమిని చెల్లిస్తోంద‌ట‌.

సైరా డిజిట‌ల్ రైట్స్ జెమినికి ఇవ్వ‌లేదు. వాటిని అమెజాన్ ప్రైమ్ వాళ్ల‌కు 50కోట్ల‌కు అమ్మేశారు. తాజా వివ‌రాల‌తో శాటిలైట్ హ‌క్కులు గంప‌గుత్త‌గా 120 కోట్ల‌కు అమ్మారు అన్న‌ది అస‌త్యం అని తేలిపోయింది. బ‌హుభాషా చిత్రంగా పాన్ ఇండియ‌న్ సినిమాగా రిలీజ‌వుతోంది కాబ‌ట్టి శాటిలైట్ రైట్స్ వ్య‌వ‌హారంలో చాలానే క‌న్ఫ్యూజ‌న్స్ నెల‌కొన్నాయి. ఇక డిజిట‌ల్ వ‌ర‌కూ అమెజాన్ లో వీక్షించే వీలుంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.


Tags:    

Similar News