అక్కినేని కుటుంబానికి `మనం` ఎన్నటికీ మరపురాని ఓ తీపి జ్ఞాపకం. కొన్ని వరుస ఫ్లాపుల తర్వాత అక్కినేని ఫ్యామిలీకి చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన చిత్రం కావడంతో ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది. నటశిఖరం ANR చివరి చిత్రం కావడంతో ఎంతో సెంటిమెంట్ ని ఫీలైంది ఆ ఫ్యామిలీ. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కినేని ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెడుతూ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మనం తెలుగు సినిమా హిస్టరీలోనే ఒక క్లాసిక్ గా నిలిచిపోవడంతో అక్కినేని కుటుంబం.. ఆ ఫ్యామిలీ అభిమానులు నిరంతరం ఈ మూవీ సీక్వెల్ గురించి ఆసక్తిగానే వేచి ఉన్నారు.
`మనం` రిలీజ్ తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రచారం సాగింది. కానీ ఇప్పటివరకూ దానికి సంబంధించిన పనులేవీ మొదలు కాలేదు . నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్ కె `థాంక్స్` మూవీని రూపొందించిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. అంతకుముందు నుంచి మనం సీక్వెల్ వార్తల్లో ఉంది. నాగార్జునతో సీక్వెల్ గురించి దర్శకుడు కొద్ది రోజుల క్రితం చర్చలు జరిపారని కూడా ప్రచారం సాగింది. నాగార్జున- విక్రమ్ కె. కుమార్ బృందం ఈ సీక్వెల్ ని సాధ్యమైనంత తొందర్లోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారని స్క్రిప్టు పనులపైనా ఆలోచిస్తున్నారని ప్రచారం సాగడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. చైతో విక్రమ్ కె `థాంక్స్` మూవీ సెట్స్ లో ఉండగా.. మరోసారి మనం సీక్వెల్ గురించిన చర్చ సాగిందని గుసగుసలు వినిపించాయి. కానీ ఆ చిత్రం పరాజయం తర్వాత దానిపై ఎలాంటి ముచ్చటా వినిపించలేదు.
లెజెండ్ ఏఎన్నార్ అంతర్థానం (22 జనవరి వర్థంతి) అయ్యారు కాబట్టి ఇక అక్కినేని కుటుంబంలో మరో `మనం` చూడలేమా? అన్నది ఇప్పుడు అభిమానుల ప్రశ్న!! అక్కినేని అభిమానుల ఈ సందేహానికి ఎవరు సమాధానమిస్తారో చూడాలి. కింగ్ నాగార్జున ప్రణాళిక ఎలా ఉండనుందో... చై ఏమంటాడో? మనం క్లైమాక్స్ లో మెరుపులా ప్రత్యక్షమైన అక్కినేని అఖిల్ అయినా దీని గురించి ఏదైనా ఆలోచిస్తున్నాడా? అన్నది వేచి చూడాలి. నేడు అక్కినేని ఎనిమిదో వర్థంతి సందర్భంగా అభిమానుల్లో మనం సీక్వెల్ గురించి ఆసక్తికర చర్చ సాగింది. అక్కినేని అభిమానుల సోషల్ మీడియాలు వాట్సాప్ గ్రూపుల్లో దీనిపై డిబేట్ సాగింది.