సినిమాలు ఉన్నాయి.. కలెక్షన్స్ లేవు

Update: 2019-11-15 06:10 GMT
నవంబర్ నెలను తెలుగు సినిమాలకు అన్ సీజన్ గా భావిస్తారు. అందుకే క్రేజీ సినిమాలు.. స్టార్ హీరోల సినిమాల రిలీజులు దాదాపు గా నవంబర్ లో ఉండవు. కొన్ని చిన్న సినిమాలు మాత్రం రిలీజ్ అవుతాయి.  చిత్రమైన విషయం ఏంటంటే కోలీవుడ్ వారికి మాత్రం నవంబర్ బిగ్గెస్ట్ సీజన్. మనకు సంక్రాంతి.. దసరా సీజన్లు ఎలానో తమిళుల కు దీపావళి సీజన్ అలా భావిస్తారు. అందుకే విజయ్.. అజిత్ లాంటి పెద్ద స్టార్ల సినిమాలు దీపావళి కి విడుదల అవుతాయి.

ఈ నవంబర్ బాక్స్ ఆఫీస్ సంగతి గమనిస్తే  తెలుగు లో చిన్న సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి.  అయితే వాటి లో ఒక్కటి కూడా సరైన హిట్ అనిపించుకో లేదు.  కానీ తమిళ డబ్బింగ్ సినిమాలు 'విజిల్'.. 'ఖైదీ' మంచి కలెక్షన్స్ సాధించాయి. 'విజిల్' మంచి ఒపెనింగ్స్ తెచ్చుకుంది కానీ తర్వాత స్లో అయి పోయింది.  అయితే 'ఖైదీ' నెమ్మది గా ప్రారంభం అయినా మంచి కలెక్షన్స్ తో హిట్ గా నిలిచింది. నిజాని కి తెలుగు సినిమాలు కనుక మంచి కంటెంట్ తో వచ్చి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి స్కోప్ ఉండేదని.. ఇప్పుడు మన ఫిలిం మేకర్లు అలోచిస్తున్నారట. అనవసరం గా అన్ సీజన్ అనే ఆలోచన తో కోలీవుడ్ వారికి నవంబర్ ను రాసిచ్చామని ఇప్పుడు బాధపడుతున్నారట.

నిజమే.. అందరూ సంక్రాంతి.. దసరా.. క్రిస్మస్.. సమ్మర్ సీజన్లు కావాలి అని పట్టు బట్టి మిగతా డేట్స్ ను వదిలేస్తున్నారు. అలా కాకుండా ఇలాంటి నవంబర్ లాంటి నెలలలో కూడా మంచి సినిమాలు ప్లాన్ చేస్తే పక్క భాషల వాళ్ళు కలెక్షన్స్ పట్టుకెళ్ళిపోయే చాన్స్ ఉండదు.  ఈనెలలో ఇప్పటి వరకూ రిలీజ్ అయిన స్ట్రెయిట్ తెలుగు సినిమాల పరిస్థితి చూస్తే మాత్రం కలెక్షన్స్ లేని నెలగా మిగిలి పోతుందని ట్రేడ్ వర్గాల వారు వ్యాఖ్యానిస్తున్నారు.


Tags:    

Similar News