ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న పాప్ స్టార్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ 13 ఏళ్ల క్రితం తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో ఆమెకు సంబంధించిన అన్ని విషయాల పై తండ్రికి కన్జర్వేటర్ షిప్ ను కోర్టు కట్టబెట్టింది. అప్పటి నుండి బ్రిట్నీ స్పియర్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని తండ్రి జామీ స్పియర్స్ చూసుకుంటున్నారు. తన తండ్రి వద్ద బానిస మాదిరిగా పడి ఉండాల్సి వస్తుందని... తనకు బానిసత్వం నుండి విముక్తి కావాలంటూ ఆమె విజ్ఞప్తి చేస్తూ కోర్టును ఆశ్రయించింది. తనకు పెళ్లి చేసుకోవాలని ఉంది.. పిల్లలకు తల్లి కావాలని ఉందని ఆమె పేర్కొంది. కాని తన తండ్రి మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. తనకు పిల్లలు కలుగకుండా ఐయూడీ అనే పరికరంను శరీరంలో అమర్చారని ఆమె పేర్కొంది.
లాస్ ఎంజిల్స్ కోర్టు లో ఆమె ఈ పిటీషన్ ను దాఖలు చేయడం జరిగింది. తనకు ఇష్టం లేకున్నా కూడా రెగ్యులర్ గా లైవ్ షో లు చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ప్రతి సారి కూడా నా నిర్ణయాలతో సంబంధం లేకుండా వారి ఇష్టానుసారంగానే వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు ఒప్పుకోకుంటే మాత్రం దాడి చేస్తున్నారని కూడా ఆమె తండ్రిపై ఆరోపణలు చేసింది. తనను ఒక బానిస మాదిరిగా తండ్రి చూస్తున్నాడు అంటూ ఆమె కోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేసింది. కోర్టులో ఆమె చేసిన ఫిర్యాదు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కోర్టులో ఫిర్యాదు నేపథ్యంలో బ్రిట్నీ తండ్రి జామా స్పియర్స్ స్పందించాడు. ఆమె సంరక్షుడిగా ఆమెకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాను. ఆమె క్షేమంగా ఉండటం కోసమే తాను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. ఆమె పెళ్లికి మరియు గర్బంకు తాను అడ్డు పడుతున్నట్లుగా చేసిన ఆరోపణలను ఆయన ఖండించాడు. ఆమె వ్యక్తిగత విషయాల్లో నేను ఎప్పుడు అడ్డు పడలేదు. ఆమె 2012 లో వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఆమెకు పెళ్లి అయితే తాను అతడికి కన్జర్వేటర్ షిప్ బాధ్యతలను అప్పగించేందుకు ఒప్పుకున్నాను. కాని వారు 2013 లో విడిపోయారు. ఆమె ఆరోపణలకు సంబంధించి తాను వివరణ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లుగా కొన్ని పత్రాలను సమర్పించాడు. ఒక వేళ ఆరోపణలు నిజం అని తేలితే మాత్రం శిక్షకు కూడా సిద్దమే అంటూ జామీ పేర్కొన్నాడు.