తెలుగు సినిమా లెజెండ్రీ నటుడు.. నిర్మాత.. స్టూడియో అధినేత అయిన దివంగత అక్కినేని నాగేశ్వర రావు గారి పేరు మీద ప్రతి ఏడాది జాతీయ అవార్డుల ను ఇస్తున్న విషయం తెల్సిందే. జాతీయ స్థాయి లో సినిమా రంగం లో అత్యున్నత సేవ చేసిన వారికి గాను ఈ అవార్డుల ను ఇస్తున్నట్లుగా అక్కినేని ఫ్యామిలీ చెబుతూ వస్తోంది. ఒక జ్యూరీ ని ఏర్పాటు చేసి ఆ జ్వూరీ ఆధ్వర్యంలో జాతీయ అవార్డుల ను ఇస్తూ ఉన్నారు. ఈ ఏడాది ఏఎన్నార్ జాతీయ అవార్డుల ను ఈనెల 17న ఇవ్వబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.
ఇక ఏఎన్నార్ జాతీయ అవార్డు 2018కు ఇద్దరు ఎంపిక అయ్యారు. అతి లోక సుందరి గా పేరు తెచ్చుకుని దేశ వ్యాప్తం గా విశేషమైన గుర్తింపు అభిమానులను దక్కించుకున్న దివంగత శ్రీదేవికి ఏఎన్నార్ జాతీయ అవార్డు దక్కింది. గతంలో ఏఎన్నార్ తో పలు సినిమాల్లో నటించిన శ్రీదేవి ఆ తర్వాత ఆయన తనయుడు అయిన నాగార్జునతో కూడా నటించిన విషయం తెల్సిందే. రెండు తరాల హీరోలతో నటించిన మొదటి హీరోయిన్ గా శ్రీదేవి రికార్డు దక్కించుకుంది.
శ్రీదేవి తో పాటు బాలీవుడ్ లో ఒకప్పుడు వెలుగు వెలిగి స్టార్ గా నిలిచిన రేఖ కు కూడా ఏఎన్నార్ జాతీయ అవార్డు దక్కింది. ఈ రెండు అవార్డులు కూడా ఈనెల 17వ తారీకున చిరంజీవి గారి చేతుల మీదు గా ఇవ్వ బోతున్నట్లు గా జ్వూరీ ప్రకటించింది. గొప్ప వ్యక్తి కి సంబంధించిన అవార్డు ఇద్దరు గొప్ప వ్యక్తుల కు ఇవ్వబోతుండటం ఆనంద దాయకం అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియో లో ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరుగబోతుంది. సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు ఇంకా పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ అవార్డు వేడుక లో పాల్గొనబోతున్నట్లు గా నిర్వాహకులు ప్రకటించారు.