మన తెలుగు సినిమాలకు అతి పెద్ద సీజన్ సంక్రాంతి. ఆ తర్వాత దసరా సీజన్. ఈ రెండు సీజన్ ల కోసం మన హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ చాలా వెయిట్ చేస్తుంటారు. తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా ఈ సీజన్ కోసమే చూస్తారు. ప్రతి సంవత్సరం ఈ సీజన్లలో పెద్ద, చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. ఈ సంవత్సరం సంక్రాంతికి 'ఎఫ్ 2, వినయ విధేయ రామ, ఎన్టీఆర్ మహానాయకుడు, పేట' లాంటి పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఒక్క 'ఎఫ్ 2' సినిమా మాత్రమే హిట్ అయ్యింది. అలాగే ఇప్పుడు దసరా సీజన్ కి ఒక పెద్ద సినిమా(సైరా), మీడియం రేంజ్ సినిమా (చాణక్య), ఒక చిన్న సినిమా (ఊరంతా అనుకుంటున్నారు) రిలీజ్ అయ్యాయి. అయితే ఇందులో ఒక్క సైరా మూవీకి మాత్రమే హిట్ టాక్ వచ్చింది. మిగిలిన సినిమాలు రెండు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
సైరా మూవీ హిట్ టాక్ వచ్చిన అనుకున్న రేంజ్ లో కల్లెక్షన్స్ అయితే రావట్లేదు. చాణక్య మూవీ పక్క రొటీన్ సినిమా అని ప్రేక్షకులు దీనిని కూడా పక్కన పెట్టేశారు. ఇంక అవసరాల శ్రీనివాస్, నవీన్ నటించిన సినిమా ఊరంతా అనుకుంటున్నారు సినిమా అనవసరమైన సీన్లతో నింపేశారు. దాంతో ఇది అసలు ఉనికిలోనే లేకుండా ఉండిపోయింది. దాంతో 2019 దసరా సీజన్ ని మనవాళ్ళు అలా అటకెక్కించారు.