డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న 'లైగర్' సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. కరోనా వల్ల దాదాపుగా రెండేళ్ల పాటు సాగిన లైగర్ కు ఇటీవలే గుమ్మడి కాయ కొట్టేసినట్లుగా స్వయంగా పూరి జగన్నాద్ ప్రకటించాడు. అదే సమయంలో ఇక జనగణమన అంటూ అధికారికంగా ప్రకటించాడు. గత కొన్ని రోజులుగా పూరి జగన్నాధ్ తన డ్రామ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన ను విజయ్ దేవరకొండతో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా ఉంటుంది అంటూ వార్తలు వచ్చాయి.
ఆ వార్తలు నిజమే అన్నట్లుగా లైగర్ షూటింగ్ పూర్తి అయినట్లుగా ప్రకటించిన సమయంలో పూరి జగన్నాద్ ప్రకటన ఉంది. ఖచ్చితంగా పూరి చేయబోతున్న ఆ జనగణమన విజయ్ దేవరకొండ తోనే అంటూ ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ చర్చనీయాంశంగా మారింది.
జనగణమన సినిమా కథ ను మహేష్ బాబుతో చేసేందుకు పూరి రాసుకున్నాడు. మూడు నాలుగు సంవత్సరాల క్రితమే ఒక పోస్టర్ ను విడుదల చేశాడు. దాంతో మహేష్ బాబుకు ఒక మంచి సినిమా పడబోతుంది అంటూ అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా మహేష్ బాబు తో జనగణమన కాకుండా విజయ్ దేవరకొండతో తెరకెక్కించేందుకు పూరి సిద్దం అయ్యాడని తేలిపోయింది. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందబోతున్న ఈ సినిమా టైటిల్ చూస్తేనే ఇది ఒక దేశ భక్తి సినిమా అని క్లారిటీ వచ్చింది.
ఈ సినిమా లో దేశ భక్తితో పాటు పూరి మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమా లో విజయ్ దేవరకొండ ఒక సోల్జర్ గా కనిపించబోతున్నట్లుగా తాజా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఇండస్ట్రీ వర్గాలు మరియు సోషల్ మీడియా ప్రచారం ప్రకారం ఈ సినిమా స్టోరీ లైన్... ఒక రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయి ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో పరిపాలకు పూర్తిగా విఫలం అయ్యి.. సమాజంలో అసమానతలు తొలగించడంలో నాయకులు విఫలం అవ్వగా.. సామాన్యుల హక్కులు కాలరాస్తున్న సమయంలో ఆర్మీ రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది.. ఆర్మీ ఆఫీసర్ ఆ రాష్ట్రంలో తీసుకు వచ్చిన మార్పు ఏంటీ.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటీ అనేది కథ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ స్టోరీ లైన్ లో నిజం ఎంతో కాని ఇదే కనుక నిజం అయితే అభిమానులకు పండుగే అనడంలో సందేహం లేదు. తెలుగు లోనే కాకుండా ప్రతి ఒక్క భాషలో కూడా ఈ సినిమా ఆడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. లైగర్ ను ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయబోతున్నారు కనుక వచ్చే ఏడాది వరకు ఈ జనగణమన కోసం వెయిట్ చేయాల్సిందే.