ఈ ఆయుధ పూజ స‌రికొత్త‌గా

Update: 2019-11-09 10:43 GMT
మలయాళ మెగా స్టార్ మ‌మ్ముటి న‌టిస్తోన్న తాజా వార్ ఎపిక్ చిత్రం `మమాంగం`. 17వ శ‌తాబ్ధం నాటి క‌థ‌తో కేర‌ళ వ‌ల్లువ‌నాడు ప్రాంతానికి చెందిన ఒక యుద్ధ వీరుడి క‌థ‌ తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మ‌ల‌యాళం లో తెర‌కెక్కిన తొలి భారీ వారియ‌ర్ పాన్ ఇండియా చిత్ర‌మిది. మ‌మ్ముట్టి ఈ చిత్రం లో పోరాట వీరుడిగా క‌నిపించ‌నున్నారు. మ‌మాంగం అంటే ఓ పండ‌గ‌. ప్ర‌త్యేక యుద్ధ విద్య‌ల ప్ర‌ద‌ర్శ‌న తో రంజింప‌జేసే ఓ ప్ర‌త్యేక‌ మైన పండ‌గ అని చెప్పాలి. తాజాగా మ‌మాంగం తెలుగు ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఇందులో మ‌మ్ముట్టి ఓ ప్ర‌త్యేక యుద్ధ క‌ళ‌ లో ఆరి తేరిన వీరుడిగా క‌నిపిస్తున్నారు. మ‌మ్ముట్టి ఉప‌యోగిస్తున్న ఆ పొడ‌వాటి కొర‌డా లాంటి క‌ర‌వాలం.. దాంతో విద్య ఎంతో కొత్త‌గా ఉంది. కేర‌ళ పురాత‌న విద్య‌లో ఇది చాలా స్పెష‌ల్ అని చెప్పాలి. ఇక ఆడ మ‌గ పిల్లా పీచు అనే తేడా లేకుండా యుద్ధ విద్య‌ ల్లో ఆరితేరిన వీరులుగా క‌నిపిస్తున్నారు.  హిస్ట‌రీ ఆఫ్ పెయిన్ అని చెబుతున్నారు కాబ‌ట్టి విజువ‌ల్స్ లో భారీ మార‌ణ హోమానికి సంబంధించిన ఓ దృశ్యం గ‌గుర్పొడుస్తోంది. అత‌డిని ఎదుర్కోవ‌డం అంటే రావ‌ణుడిని ఎదుర్కొన్న‌ట్టే! అన్న‌ డైలాగ్ తోనే హైప్ పెంచారు.

ఈ చిత్రాన్ని కావ్య ఫిల్మ్ కంపెనీ నిర్మించ‌గా.. తెలుగు లో గీతా డిస్ట్రిబ్యూట‌ర్స్ రిలీజ్ చేస్తున్నారు. ద‌క్షిణాది అన్ని భాష‌లు స‌హా ఉత్త‌రాదినా ఈ సినిమా రిలీజ్ కానుంది. మ‌మ్ముట్టి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు కొత్త‌కాదు. ర‌జ‌నీ  `ద‌ళ‌ప‌తి` రోజుల నుంచి అత‌డు సుప‌రిచితం. ఇటీవ‌లే వైయ‌స్సార్ బ‌యోపిక్ లో న‌టించి మ‌న ఆడియెన్ కి మ‌రింత‌గా చేరువ‌య్యారు. అయితే మ‌మాంగం తెలుగు వెర్ష‌న్ కి మ‌మ్ముట్టి త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. ఆయ‌న వాయిస్ లో గాంభీర్యం ఆక‌ట్టుకున్నా.. పూర్తి స్థాయిలో తెలుగు ప‌దాల ఉచ్ఛార‌ణ కుద‌ర‌లేదు. ప‌ద ఉచ్ఛార‌ణ‌లో స్ప‌ష్ఠ‌త కొర‌వ‌డింది. ఒక వారియ‌ర్ డ్రామా కాబ‌ట్టి అది అంత‌గా ప‌ట్టించుకోవాల్సిన ప‌ని లేదా! అన్న‌ది చూడాలి.
Full View
ఈ చిత్రానికి ముగ్గురు ద‌ర్శ‌కులు ప‌ని చేయ‌డం ఆస‌క్తిక‌రం. తొలి షెడ్యూల్ ని సంజీవ్ పిళ్లై  తెర‌కెక్కించ‌గా... రెండో షెడ్యూల్ కి ఎం.ప‌ద్మా కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో ప్రాచీ తెహ్లాన్ హీరోయిన్ గా న‌టించ‌గా.. ఉన్ని ముకుంద‌న్ కీల‌క పాత్ర పోషించారు. త్వ‌ర‌లో సినిమా రిలీజ్ కానుంది.
Tags:    

Similar News