ఏ సినిమాకైనా పాటలు ప్రధానమైన ఆకర్షణగా కనిపిస్తూ ఉంటాయి. ఎంతటి బలమైన కథాకథనాలు ఉన్నప్పటికీ, పసందైన పాటలు ఉండవలసిందే. కొన్ని సందర్భాల్లో మాటలు చెప్పలేని భావాలను విప్పి చెప్పేవే పాటలు. అలాగే పాత్రలతో కలిసి పరిగెడుతూ కథలో భాగమైపోయే ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ ను ఇచ్చేది కూడా పాటలే. ఇక అలాంటి పాటలకి తగిన కొరియోగ్రఫీ ఉన్నప్పుడే అవి మరింత ఊపు .. ఉత్సాహం ఇస్తాయి. పాటలో ఏ ఇన్స్ట్రుమెంట్ ను వృథాచేయని మూవ్ మెంట్స్ ఉన్నప్పుడే అవి యూత్ నుంచి మంచి మార్కులను కొట్టేస్తాయి.
ఇక ఒక్కో హీరోకి ఒక్కో రకమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఒక్కొక్కరికీ ఒక్కో తరగతి నుంచి ఫ్యాన్స్ ఉంటారు. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకుని డాన్స్ కంపోజ్ చేయవలసి ఉంటుంది. అలా హీరోకి తగినట్టుగా స్టెప్స్ కంపోజ్ చేసి, వాళ్ల అభిమానులను సంతోషపెట్టడమనేది అంత ఆషామాషీ విషయమేం కాదు. అలాగే స్టార్ హీరోలను మెప్పించడమనేది కూడా అంత తేలికైన పనేం కాదు. అలాంటి గుర్తింపును అంచలంచెలుగా అందుకుంటూ .. స్టార్ కొరియోగ్రఫర్ గా శేఖర్ మాస్టర్ పేరు తెచ్చుకున్నారు.
'ఆచార్య' సినిమా కోసం పనిచేసిన ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " నేను సుధీర్ బాబు sms సినిమా కోసం చేసిన కొరియోగ్రఫీని చూసి, బన్నీ నాకు కాల్ చేశారు.
'జులాయి' సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ చేయమని అడిగారు. చేసింది చూసిన తరువాత నచ్చితేనే సాంగ్ ఇస్తామని అన్నారు. అందుకు ఒప్పుకుని చేసిన ఆ పాట నాకు మంచి పేరు తీసుకుని వచ్చింది. అక్కడి నుంచి పెద్ద సినిమాల వైపు ప్రయాణం మొదలైంది. మన టాలీవుడ్ హీరోల విషయానికే వస్తే ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్.
ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే ఆయన ఎనర్జీ మామూలుగా ఉండదు. చరణ్ గారి విషయానికి వస్తే డాన్స్ లో ఆయన తనదైన స్టైల్ చూపిస్తారు. చిరంజీవి గారి డాన్స్ లో గ్రేస్ ఎలాంటి పరిస్థితుల్లోను మిస్ కాదు. బాలయ్య బాబు ఎనర్జీ గురించి అందరికీ తెలిసిందే.
ఇప్పుడున్న హీరోయిన్స్ లో డాన్స్ పరంగా చెప్పుకోవాలంటే సాయిపల్లవి నెంబర్ వన్. ఆ తరువాత కొత్తగా వచ్చిన 'శ్రీలీల' కూడా బాగా చేస్తోంది. చాలామందికి తెలియదుగానీ కృతి శెట్టి కూడా చాలా మంచి డాన్సర్. ' ది వారియర్'లో ఒక సాంగ్ చేసేటప్పుడు నాకు ఈ విషయం అర్థమైంది. ఈ ముగ్గురూ కూడా డాన్సులు అదరగొట్టేవారే" అని చెప్పుకొచ్చాడు.