చియాన్ -శంక‌ర్‌- ఏ.ఆర్.రెహ‌మాన్ వారసుల పార్టీ చూశారా?

Update: 2020-12-21 04:15 GMT
సెల‌బ్రిటీ కిడ్స్ స్నేహాలు పార్టీల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఇదిగో ఈ పార్టీ అలాంటిదే. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ వార‌సుడు ధృవ్.. తో క‌లిసి స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ వార‌సుడు... ఆస్కార్ విజేత .. లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏ.ఆర్.రెహ‌మాన్ వార‌సుడు పార్టీలో చిలౌట్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.
 
ఈ అరుదైన ఫోటోలో దర్శకుడు శంకర్ కుమారుడు అర్జిత్ శంకర్ .. రెహ‌మాన్ వార‌సుడు ఎఆర్ అమీన్ ల‌ను గుర్తుప‌ట్ట గ‌లిగారా?  ధృవ్ విక్ర‌మ్ స్టెప్స్ పై మ‌ధ్య‌లో కూచున్నారు. అత‌డికి ఎడ‌మ‌వైపుగా రెహ‌మాన్ కుమారుడు.. కుడివైపు వెన‌క‌గా శంక‌ర్ కుమారుడు ఉన్నారు.

చెన్నైలోని ఒక స్టార్ హోటల్ లో ఇలా కెమెరాకి ఫోజిచ్చారు గ్రేట్ వార‌స‌ర‌త్నాలు. ఈ దృశ్యం అభిమానులకు క‌న్నుల‌పండుగ‌నే త‌ల‌పిస్తోంది మ‌రి.

ధ్రువ్ విక్రమ్ తన తొలి చిత్రం ఆదిత్య వర్మ (అర్జున్ రెడ్డి రీమేక్) తో తన నటనా పరాక్రమాన్ని నిరూపించాడు. మరోవైపు ఎఆర్ అమీన్ ఇప్పటివరకు కొన్ని హిట్ పాటలు పాడారు. తండ్రి వ‌ద్ద‌ క్రమం తప్పకుండా సంగీత సాధ‌న చేస్తున్న అత‌డు త్వ‌ర‌లోనే మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. చివరగా అర్జిత్ శంకర్ ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ పొందుతున్నాడని భవిష్యత్తులో తన తండ్రి అడుగుజాడలను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది.
Tags:    

Similar News