హీరో విశాల్ నిర్మాతగా మారి పలు చిత్రాలను నిర్మించిన విషయం తెల్సిందే. తాజాగా థప్పరివాలన్ 2 చిత్రంతో దర్శకుడిగా కూడా మారాడు. విశాల్ హీరోగా గతంలో వచ్చిన థప్పరివాలన్ చిత్రానికి మిస్కిన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగులో డిటెక్టివ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో అదే టీం సీక్వెల్ చేశారు. అయితే సీక్వెల్ సమయంలో వచ్చిన విభేదాల కారణంగా దర్శకుడు మిస్కిన్ సినిమాను మద్యలో వదిలేసి వెళ్లి పోయాడు.
దర్శకుడు మిస్కిన్ వదిలేసిన థప్పరివాలన్ 2 చిత్రాన్ని నిర్మాత కూడా అయినా విశాల్ భుజాన ఎత్తుకున్నాడు. షూటింగ్ ను ఏదోలా పూర్తి చేస్తున్నాడు. దర్శకుడు తప్పుకున్న విషయమై ఇప్పటి వరకు విశాల్ నోరు మెదపలేదు. మొదటి సారి సుదీర్ఘంగా మిస్కిన్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా లో ఓపెన్ లెటర్ ను పోస్ట్ చేశాడు. కోట్లు ఖర్చు పెట్టిన సినిమాను మద్యలో వదిలేయడం వల్ల తాను బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చిందంటూ విశాల్ చెప్పుకొచ్చాడు.
నిర్మాతలు ఎప్పుడు కూడా దర్శకుడి వెంటపడి బతిమిలాడరు. నిర్మాతలతో బతిమిలాడిచ్చుకోవాలని చూసే దర్శకులను పట్టించుకోవద్దని అన్నాడు. కొత్తగా వచ్చే నిర్మాతల కోసం తాను ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పదల్చుకున్నాను. నిర్మాతలు ఎలా ఉండాలి అనే విషయాన్ని సుదీర్ఘంగా తన లేఖలో విశాల్ పేర్కొన్నాడు. దర్శకుడితో సినిమా చేయించుకోవాలి తప్ప ఆయన్ను బతిమిలాడుకుంటూ పని చేయించుకోనక్కర్లేదు అనేది విశాల్ లేఖ సారాంశం. మరి విశాల్ బహిరంగ లేఖపై దర్శకుడు మిస్కిన్ ఎలా స్పందిస్తాడనేద చూడాలి.