ఆ స్టార్ హీరో మళ్ళీ ప్రేమలో పడ్డాడు !

Update: 2022-08-13 12:30 GMT
బాలీవుడ్‌ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ బోల్డ్ బ్యూటీ దిశాపటానీ కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. లవ్‌లో ఉన్న ఈ ఇద్దరూ.. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఖాళీగా ఉన్న సమయంలో షికార్లు కొడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు. అయితే ఈ జంట బ్రేకప్ చెప్పుకుందంటూ కొద్ది రోజులుగా తెగ వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ హీరో ఇప్పుడు మరో కొత్త భామ ఆకాంక్ష శర్మతో ప్రేమలో పడ్డాడని ప్రచారం మొదలైంది. మోడల్గా కెరీర్గా ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ సంతూర్ సోప్ యాడ్తో పాపులర్ అయింది. కన్నడలోనూ ఓ సినిమా చేసింది. టైగర్తో కలిసి రెండు మ్యూజిక్ ఆల్బమ్స్లోనూ చిందులేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమా అవకాశాల కోసం బాగా ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ తన లేత అందాలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఆ ఫొటోస్ ని ఓ సారి చూసేద్దాం..

బాలీవుడ్ ఫిట్ హీరో టైగర్ ష్రాఫ్- బోల్డ్ బ్యూటీ దిశా పటానీ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు విడిపోయారంటూ తాజాగా పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఏక్ విలన్ 2 సినిమా ప్రమోషన్స్ సమయంలోనే ఈ వార్తలు చక్కర్లు కొట్టడంతో ఇదంతా ప్రమోషన్స్ స్టంట్ అని కొందరు భావించారు. గతంలో సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ బ్రేకప్ రూమర్స్ కూడా ఇలాగే చక్కర్లు కొట్టాయి. తర్వాత అదంతా భూల్ భులయ్యా 2 సినిమా కోసం కొందరు కావాలని క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్ అని తెలిసి ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు.

అయితే ఈ సారి టైగర్.. దిశా విషయంలో మాత్రం ఈ వార్తలు నిజమే అనిపిస్తున్నాయి. ఎందుకంటే టైగర్ మోడల్ ఆకాంక్ష శర్మతో ప్రేమలో పడ్డారనే ప్రచారం బీ టౌన్ లో జోరుగా సాగుతోంది. ఆకాంక్ష శర్మ మోడల్ గా చాలా యాడ్స్ లో నటించింది. కన్నడలో ఓ సినిమా చేసింది. అయితే బాద్ షాతో చేసిన వీడియో సాంగ్ జుగ్నుతో ఈ అమ్మడుకి ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత టైగర్ తో కలిసి కాసనోవా అనే వీడియో ఆల్బమ్ లో నటించింది. అప్పుడే వీరి మధ్య స్నేహం చిగురించినట్లు బీటౌన్ కోడై కూస్తోంది.

టైగర్-దిశ బ్రేకప్.. టైగర్ -ఆకాంక్షల రిలేషన్ షిప్ విషయం తెలిసిన తర్వాత చాలా మంది ఈ ఆకాంక్ష శర్మ ఎవరనే విషయం పై కాన్సంట్రేట్ చేశారు. ఈ అమ్మడు సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూసి ఫిదా అవుతున్నారు.

అయితే ఈమె మహేష్ బాబు తో సంతూర్ యాడ్ లో కనిపించిన తార అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. టైగర్-దిశాల బ్రేకప్ వార్తలు ఓవైపు.. టైగర్-ఆకాంక్షల లవ్ వార్తలు మరోవైపు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నా.. ఇప్పటి వరకు ఈ ముగ్గురు ఈ రూమర్స్ పై స్పందించలేదు.
Tags:    

Similar News