దేశం గర్వించే అగ్ర దర్శకుడు రాజమౌళి కథలు రాయడు.. ఆయనకు వచ్చిన ఐడియాలను తండ్రి విజయేంద్రప్రసాద్ కు చెప్పి రాయిస్తాడు. అందుకే రాజమౌళి సినిమాల్లో కేవలం ‘స్క్రీన్ ప్లే-దర్శకత్వం’ మాత్రమే రాజమౌళి పేరు మీద కనిపిస్తుంది. ఇక ఆయన కథలు రూపొందించడానికే సంవత్సరాలు తీసుకుంటాడు. బాహుబలి తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ కథ కోసం సంవత్సరన్నర టైం వెచ్చించారు.
ఇక ‘అల వైకుంఠపురం’ సినిమా కథ కోసం కూడా త్రివిక్రమ్ సంవత్సరం పైనే వెచ్చించారు. ‘సరిలేరు’ మూవీకి ఓ ఆరేడు నెలలు పట్టిందనుకుంటా.. మెగాస్టార్ కోసం కొరటాల కూడా కథ కోసం సంవత్సరం కష్ట పడ్డాడట.. ఇలా కథ కోసం తెలుగు దర్శకులు సంవత్సరాలకు సంవత్సరాలు వృథా చేస్తుండడం.. ఆ సినిమాలు పట్టాలెక్కి తీసేసరికి మరో సంవత్సరం అవుతుండడం సినిమా బొమ్మ ప్రేక్షకుడు చూసేసరికి రెండేళ్లు పడుతోంది. కాలం కరిగిపోతోంది. పెద్ద హీరోల సినిమాలు సంవత్సరానికి ఒకటి కూడా రాని పరిస్థితి కనిపిస్తోంది.
దీన్ని బట్టి తేలిందేంటంటే.. టాలీవుడ్ ను కథల కొరత వేధిస్తోంది. ఒక మంచి కథ తయారు కావడానికి సంవత్సరంకు పైగా పడుతోంది. అది తెరకెక్కించాలంటే కనీసం సంవత్సరంన్నర నుంచి రెండేళ్లు పడుతుంది. ఇలా కథల కోసం ప్రస్తుతం హీరోల అన్వేషణ సాగుతోంది.
కొత్తదనం కోసం దర్శకులు, రచయితలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వాస్తవిక కథలు ప్రాధాన్యం పెరిగింది. బయోపిక్ లా కాలం నడుస్తోంది. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ ఆ చిత్ర కథను ఓ వాస్తవ మెడికల్ స్టూడెంట్ జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకొని రాశారు. కానీ అందులోని బోల్డ్ నెస్ వివాదాస్పదమైంది. నిజానికి మెడికల్ స్టూడెంట్స్ ఫీల్డ్ లో అంతకంటే దారుణం గా వ్యవహరిస్తారు. ర్యాంగింగ్, రోమాన్స్ అంతకు మించే ఉంటుంది. సందీప్ వంగా కొంచెం వాస్తవికతతో సినిమా తీయడంతో విమర్శకులు నోరుపారేసుకున్నారు. కానీ యువత, మెడికల్ స్టూండెంట్స్ మాత్రం దానికి కనెక్ట్ అయ్యారంటే అది వారి జీవితాల్లో జరుగుతున్న సహజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించడమే..
నిజానికి వాస్తవిక కథలు హిట్ బాగా అవుతుంటాయి. కానీ అదే సమయంలో ఆ వాస్తవికతను బోల్డ్ నెస్ అని సంప్రదాయవాదులు సినిమాపై విమర్శలు చేస్తారు. అడ్డుకుంటున్నారు. సహజసిద్ధమైన కథలే ఎక్కువ హిట్ అవుతాయని ఎన్నో సార్లు నిరూపితమైంది.
బాహుబలి కూడా ఒక భారతీయ ఇతిహాసాల్లోని కథలను బేస్ చేసుకొని కమర్షియల్ గా అల్లిన కథ. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కూడా కొమురంభీం, అల్లూరి జీవితాల్లో వారు అజ్ఞాతవాసం ఇద్దరూ ఒకేసారి ఎటువెళ్లిపోయారో దాన్ని బేస్ చేసుకొని అల్లిన కథే.
అందుకే ఈ మధ్య మన హీరోలు ఒకేసారి 100 మంది గాల్లోనే కొట్టేసేలాంటి కథలను ఎంచుకోవడం లేదు. అలాంటి స్టంట్లు చేయడం లేదు. ఆ మూసధోరణితో చేస్తే సినిమా ఫ్లాప్ పక్కా అని వారికి తెలుసు. అందుకే కొంచెం నేచురాలిటీ కి దగ్గర గా కథలు రెడీ చేయమంటున్నారు. అందుకే కాస్త టైం పడుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్ ను వేధిస్తున్న ఈ కథల సమస్య కు పరిష్కారం రచయితలు, దర్శకుల చేతుల్లోనే ఉంది. కొన్ని స్ఫూర్తినిచ్చే వాస్తవిక కథల జీవితాలను తరిచిచూస్తే అందులో ఎన్నో కథలు కనపడతాయి. సమాజంలో జరిగిన ఘటనలు తెలుసుకొని వాటిపై కథలు అల్లితే ఎన్నో కొత్త స్టోరీలు కనపడుతాయి. వాటిని వెతికి తీర్చిదిద్దడమే వారి చేతుల్లో ఉంది. చూడాలి.. మరి దర్శకులు, రచయితలు మారుతారో లేదో..