ఓ సినిమా ప్రారంభం నుంచి విడుదల తేదీ వరకూ... ఆ మూవీ గురించి జనాలు మాట్లాడుకునేలా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పబ్లిసిటీ అంటే చాలా దారులు ఉన్నాయి కానీ.. గతంలో అయితే సినిమా వీక్లీల్లో వచ్చే వార్తలే ఆధారం. ఇవి కాక ఆడియో రిలీజ్ ఫంక్షన్లు - సీడీలు - పోస్టర్లు మాత్రమే పబ్లిసిటీకి ఆధారం. కానీ ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిపోయినా.. టాలీవుడ్ లో దీన్ని పక్కాగా వాడుకుంటున్న దాఖలాలు తక్కువే. బాలీవుడ్ - కోలీవుడ్ లతో పోల్చినా మనోళ్లు ట్విట్టర్ లాంటి వాటితో ప్రచారం విషయంలో వెనకబడే ఉన్నారు. ఇక ప్రస్తుతం సినిమా ప్రచారానికి అనేక దశలను పాటిస్తున్నారు మన మూవీ మేకర్స్.
మొదటగా సినిమాకి ఫస్ట్ లుక్. అప్పటికీ, ఇప్పటికీ.. ఎప్పటికైనా ఈ ఫస్ట్ లుక్ ఉన్న హైప్ వేరే దేనికీ లేదు. సినిమాలో లేకపోయినా ఓ స్పెషల్ సాంగ్ ను రూపొందించి ప్రచారం కోసం వాడుకోవడమే ప్రోమో సాంగ్ కాన్సెప్ట్. ఇక సినిమాలోని సూపర్బ్ అనిపించే సీన్స్ తో ఓ 30సెకన్ల క్లిప్పింగులకు మించని వీడియోను టీజర్ గా విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత ఆడియో ఫంక్షన్. శతదినోత్సవాలు కరువైపోవడంతో.. ఆడియో ఫంక్షన్స్ నే ఆ రేంజ్ లో జరిపేస్తున్నారు. ఆడియో సక్సెస్ మీట్ అంటూ.. యూనిట్ అంతా మరోసారి జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆడియోతో పాటే జనాల్లోకి వచ్చే మరో అంశం థియేట్రికల్ ట్రైలర్. సినిమాపై ప్రేక్షకులు ఓ అంచనాకు రావడానికి థియేట్రికల్ ట్రైలర్ చాలా ముఖ్యం.
థియేట్రికల్ ట్రైలర్ ను వేరే సినిమాల్లో కలిపి ప్రదర్శించడమే ఇన్ ఫిలిం ట్రైలర్. ఇది మన దగ్గర బాగా తక్కువ. సినిమాపై నమ్మకం లేకపోవడమో, ఆ కాన్సెప్ట్ పై నమ్మకం లేకపోవడమో చెప్పలేం కానీ.. రిలీజ్ కి ముందు ప్రీమియర్ వేసే ధైర్యం మనోళ్లకు పెద్దగా లేదు. కాకపోతే.. కొన్ని గంటల ముందు వేసే బెనిఫిట్ షోలనే ప్రీమియర్స్ అనుకుంటూ ఉంటారంతే. వీటికి తోడు ఈ మధ్య మోషన్ పోస్టర్ - కేరక్టర్ ఇంట్రడక్షన్ - ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి కొత్త కొత్త కాన్సెప్టులు కూడా వస్తున్నాయి.