ఒక ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టి కొబ్బరికాయ కొట్టిన రోజే ఆ సినిమా విడుదల ఎప్పుడవుతుందో వెల్లడించడం నేటి నయా ట్రెండ్. అనుకున్న బడ్జెట్ లో రాసుకున్న షెడ్యూళ్ళలో ఒక సినిమా తీసి చెప్పిన టైం కి విడుదల చేయడం అందరికీ మంచి విషయమే. అయితే పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఈ విధమైన చర్యతో బెడిసికొడుతుండడం గమనార్హం.
ఇటీవల విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ముందుగా తాపీగా షూటింగ్ చేసుకున్న ఈ సినిమా చెప్పిన టైం కి రావాలనే ఉద్దేశంతో ఆదరాబాదరాగా షూటింగ్ కానిచ్చేసారు. దాని అవుట్ పుట్ సెకండ్ హాఫ్ లో ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
అయితే మరికొన్ని పెద్ద సినిమాలు క్వాలిటీ విషయంలో రాజీకాక విడుదలని వాయిదా వేసుకుంటున్నాయి. బ్రహ్మోత్సవం ముందుగా ఏప్రిల్ లో రిలీజ్ అన్నా అది కాస్తా మే కి షిఫ్ట్ అయ్యింది. 2016లో రిలీజ్ అన్న బాహుబలి 2017కి మారిపోయింది. వీటన్నిటి వెనుకా వున్న కారణం ఒకటే... క్వాలిటీ అవుట్ పుట్..