ట్రైల‌ర్ టాక్‌: కామెడీ తో లాయ‌ర్‌ తెనాలి రామ‌ కృష్ణ

Update: 2019-11-10 05:31 GMT
రీసెంట్‌ గా హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం `నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో ఆక‌ట్టుకున్న యంగ్ హీరో సందీప్ కిష‌న్ తాజా గా  కామెడీ చిత్రంతో ప్రేక్ష‌కుల్ని  న‌వ్వించ‌డానికి వ‌స్తున్నాడు. సందీప్‌ కిష‌న్ హీరో గా న‌టిస్తున్న తాజా చిత్రం `తెనాలి రామ‌ కృష్ణ బిఏబిఎల్‌`. జి.నాగేశ్వ‌ర‌ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. హ‌న్సిక క‌థానాయిక‌ గా న‌టిస్తోంది. రీసెంట్‌ గా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఇంద‌లో పార్ట్ టైమ్ లాయ‌ర్‌ గా సందీప్‌ కిష‌న్ క‌నిపించ‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది.
Full View
చాలా కాలం గా పెండింగ్‌ లో వున్న కేసుల్ని త్వ‌ర‌గా ప‌రిష్క‌రిస్తాన‌ని, దీనికి భారీ డిస్కౌంట్‌ లు కూడా ప్ర‌క‌టించ‌డం న‌వ్వులు పూయిస్తోంది. హీరోయిన్ హ‌న్సిక కూడా ఇందు లో లాయ‌ర్‌ గా న‌టిస్తోంది. వీళ్లిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు థీయేట‌ర్‌ లో న‌వ్వులు పూయించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. న‌వ్వుల‌తో సాగుతున్న ఈ ట్రైల‌ర్ సందీప్ మ‌ర్ద‌ర్ కేస్ టేక‌ప్ చేయ‌డంతో సీరియ‌స్ ట‌ర్న్ తీసుకుంది. సినిమాని మ‌లుపుతిస్పే కీల‌క కీ పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ న‌టించింది. ఇందులో వ‌రు నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. త‌న చేతికి వ‌చ్చిన మ‌ర్ద‌ర్ కేస్‌ ని తెనాలి రామ‌కృష్ణ ఎలా ప‌రిష్క‌రించాడ‌న్న‌దే అస‌లు క‌థ‌.దీనికి త‌న‌దైన మార్కు కామెడీని జోడించి ద‌ర్శ‌కుడు జి. నాగేశ్వ‌ర‌ రెడ్డి ఆద్యంతం హాస్యంగా తెర‌కెక్కించిన తీరు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునేలానే క‌నిపిస్తోంది.
Tags:    

Similar News