రంగుల మాయా ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ఈ రంగంలో అవకాశాలు ఉన్నంతవరకూ అంతా సవ్యంగానే సాగుతుంది. ఉపాధి కరువై ఆ తర్వాత ఒకసారి తప్పుదారిలో వెళితే ఆ తర్వాత పర్యవసానాలు అంతే దారుణంగా ఉంటాయి. అందుకు పలువురు నటీమణుల జీవిత ప్రయాణం సాక్ష్యంగా నిలుస్తుంది. శ్వేతాబసు ప్రసాద్ ఇందుకు మినహాయింపు కాదు. కొత్త బంగారు లోకం సహా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్వేతాబసుపై ఆరోపణలు అరెస్టుల ఫర్వం అప్రస్తుతం.
ప్రస్తుతం శ్వేతాబసు నటిగా కొనసాగుతోంది. అదే క్రమంలో తాజా లుక్ ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. ఈ ఫోటోగ్రాఫ్ లో శ్వేతాబసు గుర్తు పట్టలేనంతగా మారిపోయి కనిపిస్తోంది. అభిమానులు దీనిని షేర్ చేస్తూ ఇది ఎవరో గుర్తు పట్టగలరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు ఫ్యాన్స్ దీనిని డీకోడ్ చేశారు. శ్వేతాబసు ప్రసాద్ ప్రస్తుతం ఒక వ్యభిచారి పాత్రలో నటిస్తోంది. దానికోసం ఇలా మేకోవర్ పొందిందని విశ్లేషిస్తున్నారు.
ఆ పాత్రకోసమేనా ఈ మార్పులు?
ప్రస్తుతం శ్వేతాబసు రియలిస్టిక్ కథలతో అద్భుతాలు చేసే మధుర్ భండార్కర్ దర్శకత్వంలో `ఇండియా లాక్ డౌన్` చిత్రంలో నటిస్తోంది. కరోనా సమయంలో ఇండియా లాక్ డౌన్ తో దేశంలో ఉపాధి ఎలా నిలిచిపోయిందనే కథను ఆయన తెరపై ఆవిష్కరిస్తున్నారు. ZEE5 ఒరిజినల్ సినిమా ఇది. లాక్ డౌన్ లో అన్ని వర్గాల ప్రజలు కనీస మనుగడ కోసం పోరాడిన విధానం నిజానికి భయాందోళనలకు గురిచేస్తుంది. లాక్డౌన్ సమయంలో జీవనోపాధి లేకుండా పోయిన సెక్స్ వర్కర్ ల జీవితం అపహాస్యమైంది. ఎమోషనల్ గా సాగే సెక్స్ వర్కర్ మెహ్రునిస్సా పాత్రను శ్వేతా బసు ప్రసాద్ పోషిస్తోంది.
ఇటీవలే విడుదలైన ట్రైలర్ లో శ్వేత పాత్ర తన చుట్టూ ఉన్న ఆడవారిని సామాజిక దూరం అనుభవించినందున.. వారు ఉపాధి కోసం ఎలా పని చేస్తారో మనుగడ ఎలా ఉంటుందో ఆవిష్కరించడం ఆసక్తిని కలిగిస్తుంది. ఈ పాత్రను పోషించడం వల్ల వ్యభిచార కూపంలో ఉన్న మహిళలు ఎదుర్కొన్న కష్టం గురించి అట్టడుగున ఉన్నవారిని అణచివేయడం గురించి తెరపై చూపే అవకాశం దక్కిందని శ్వేతా తెలిపింది.
వలసదారుల గురించి ఫిర్యాదు చేయడానికి పెద్దగా ఏమీ లేదు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. పిల్లలు బయటికి వెళ్లలేక ఆన్ లైన్ లో చదువుతో సరిపెట్టుకున్నారు. ఇలాంటి కష్టంలోను సెక్స్ వర్కర్ల సంఘం చాలా తక్కువగా హైలైట్ అవ్వడం కూడా చాలా బాధాకరం. వారి కమ్యూనిటీకి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం నాకెంతో ఆసక్తిని కలిగించింది అని శ్వేతాబసు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
రియల్ లైఫ్ ట్రామా.. శ్వేతా నిజజీవితంలోను ఊహించని ట్విస్టులెన్నో. తన లైఫ్ లో ఊహించని మరో ఘటన కూడా ప్రముఖంగానే చర్చకు వచ్చింది. తన చిన్న నాటి స్నేహితుడు రోహిత్ మిట్టల్ ని పెళ్లాడి ఏడాదికే బ్రేకప్ చెప్పేయడం అప్పట్లో సంచలనమే అయ్యింది. ప్రస్తుతం శ్వేతా ఒంటరి. అయినా తన లైఫ్ డైలమాల నుంచి బయటపడి ఉల్లాసంగా ఉండేందుకు తన ప్రయత్నం ఎప్పుడూ మానలేదు. నిరాశను దరిచేరనివ్వక ఆనందమయ జీవితం కోసమే తన ప్రయాణం అని చెప్పకనే చెబుతోంది. ఇటీవల సినిమాలతో బిజీ అయ్యి అన్నిటి నుంచి దూరంగా ఉంటోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.