సుశాంత్ మృతి కేసులో ప్రధాన ముద్దాయిగా మారిన రియాను టార్గెట్ చేసి నెటిజన్స్ చేస్తున్న ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. ఆమెను విమర్శిస్తూ హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేసి దాన్ని జాతీయ స్థాయిలో ట్విట్టర్ లో ట్రెండ్ చేసిన ఘనత సుశాంత్ అభిమానులకు ఉంది. ఈమద్య కాలంలో ట్విట్టర్ లో రెగ్యులర్ గా సుశాంత్ విషయంలో రియా పేరు ట్రెండ్ అవుతూనే ఉంది. ఆమెపై నెగటివ్ కామెంట్స్ మరియు బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనక్కర్లేదు. తనను బెదిరిస్తూ తన గురించి తప్పుగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అంటూ రియా సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆమెకు అనుకూలంగా ట్విట్టర్ లో ట్రెండ్ నమోదు అయ్యింది.
సుశాంత్ కేసులో రియాను ఏకపక్షంగా బలి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమెకు న్యాయం కావాలంటూ సోషల్ మీడియాలో 'జస్టీస్ ఫర్ రియా' అనే హ్యాష్ ట్యాగ్ ను పోస్ట్ చేశారు.
ఆ హ్యాష్ ట్యాగ్ కొన్ని గంటల్లోనే నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది. రియాకు కూడా చాలా మంది మద్దతు ఉందని ఆ ట్రెండ్ తో అర్థం అయ్యింది. జస్టీస్ ఫర్ రియా హ్యాష్ ట్రెండ్ అవ్వడంపై రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించాడు. ఆమె ఇంటర్వ్యూ చూసిన తర్వాత కాని జనల్లో చలనం రాలేదా అన్నట్లుగా వర్మ కామెంట్స్ చేశాడు. మొత్తానికి రియాకు అనుకూలంగా కూడా సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ రెడీ అవ్వడంతో ముందు ముందు ఈ విషయం ఎక్కడికి వెళ్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ కేసులో ఉన్న అనేక అనుమానాలను రియా తీర్చేందుకు ఇటీవల ఒక జాతీయ న్యూస్ ఛానెల్ కు రియా ఇంటర్వ్యూ ఇచ్చింది. సుదీర్ఘంగా సాగిన ఆ ఇంటర్వ్యూలో రియా పలు విషయాలను వెళ్లడి చేసింది. సుశాంత్ కు ఉన్న చెడు అలవాట్ల గురించి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి రియా వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలకు కూడా రియాను సుశాంత్ అభిమానులు టార్గెట్ చేశారు. ఇదే సమయంలో ఆమె మాటల్లో నిజాయితీ ఉందంటూ కొందరు ఆమెకు మద్దతు తెలపవడం మొదలు పెట్టారు.