సౌత్ ఇండస్ట్రీ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళవుతున్నా కొత్త హీరోయిన్స్ కి పోటీగా అవాకాశాలు అందిపుచ్చుకుంటూ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రొఫెషన్ పరంగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న 37 ఏళ్ళ త్రిష్ పర్సనల్ లైఫ్ సంగతేంటని ఆమె అభిమానులు ఆలోచిస్తుంటారు. నిజానికి అప్పట్లో వరుణ్ అనే బిజినెస్ మ్యాన్ తో కొంతకాలం పాటు డేటింగ్ చేసిన త్రిష అతడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కొన్ని రోజుల్లో పెళ్లి అనగా ఏం జరిగిందో ఏమో ఇద్దరూ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పటి వరకు దీనికి కారణం మాత్రం వెల్లడించలేదు. ఆ తరువాత త్రిషని ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా కూడా సమాధానం దాటవేస్తూ వచ్చింది. ఇక ఆ మధ్య ఫ్యాన్స్ తో కాసేపు సోషల్ మీడియాలో ముచ్చటించిన త్రిష.. 'మీ బకెట్ లిస్ట్ లో ఉన్న ఓ కోరికను చెప్పండి' అని ఓ వ్యక్తి అడుగగా ''లాస్ వెగాస్ లో పెళ్లి చేసుకోవాలని ఉంది'' అని వెల్లడించింది. పెళ్లెప్పుడనే విషయాన్ని చెప్పనప్పటికీ తనకు పెళ్లి ఆలోచనయితే ఉందని నేరుగానే చెప్పేసిందని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు.
అయితే ఇప్పుడు మరోసారి త్రిష పెళ్లి లొల్లి తెర పైకి వచ్చింది. ఈసారి త్రిష ఏకంగా తమిళ స్టార్ హీరో శింబుని పెళ్లి చేసుకుందంటూ తమిళనాట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. త్రిష - శింబు గతంలో 'అలై' 'విన్నయితాండి వరువాయా' సినిమాల్లో కలిసి నటించారు. అంతేకాకుండా ఈ కరోనా లాక్ డౌన్ లో 'కార్తీక్ డయల్ సేయఁతా ఎన్' అనే షార్ట్ ఫిలింలో ఇద్దరూ నటించారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'ఏం మాయ చేసావే 2' సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు త్రిష హీరో శింబుని పెళ్లి చేసుకుందంటూ వార్తలు రావడం విశేషం. ఇక శింబు గతంలో హీరోయిన్స్ నయనతార, హన్సిక లతో ప్రేమాయణం నడిపాడు. ఏమైందో ఏమో ఇద్దరికీ మధ్యలోనే గుడ్ బై చెప్పేసాడు. ఇప్పుడు త్రిష ని పెళ్లి చేసుకున్నాడు అంటూ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇక ఈ వార్తల పై అటు త్రిష కానీ ఇటు శింబు కానీ స్పందించలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంతో కొంత నిజమే ఉండి ఉంటుందని తమిళ వర్గాలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా త్రిష - శింబులు పెళ్లి వార్తలపై స్పందిస్తారేమో చూడాలి.