బ్యాంక్ ఎగ్జామ్.. త్రిష గురించి..

Update: 2017-12-09 05:27 GMT
సౌత్ లో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ లిస్టును తీయాలంటే కొంచెం కష్టమే. ఈ రోజుల్లో హీరోయిన్స్ అందరు ఎవరి స్టైల్ లో వారు ప్రత్యేక అందాలతో ప్రేక్షకుల మనసును దోచుకుంటున్నారు. ఇక కొంత మంది సీనియర్ హీరోయిన్స్ కూడా నేటితరం యువ హీరోయిన్స్ కి గట్టి పోటీని ఇస్తూ.. ఇంకా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా గ్లామర్ షోలకు కూడా ఏ మాత్రం అడ్డు చెప్పకుండా సై అంటున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లలో సీనియర్ హీరోయిన్ గా ఉన్న త్రిషా కూడా తన అందాలతో దాదాపు 15 ఏళ్లుగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇన్నేళ్ల కెరీర్ లో అమ్మడు ఎక్కువగా వివాదాల జోలికి వెళ్లలేదు. అంతే కాకుండా ప్రతి ఇండస్ట్రీలో అమ్మడికి మంచి గుర్తింపు ఉంది. ఆ మధ్యలో ఒక వివాదం చెలరేగినా అందరు త్రిషాకు మద్దతుగా నిలిచారు. ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. అయితే రీసెంట్ గా ఒక ఎగ్జామ్ కి సంబందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ మెటీరియల్లో అమ్మడి గురించి వచ్చిన ఒక ప్రశ్నను చూస్తే ఆమె ఎంతగా గుర్తింపు అందుకుందో మనకే అర్ధమవుతోంది.

యునిసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్ ఫర్ చైల్డ్ రైట్స్ గా ఎంపికైన యాక్టర్ ఎవరు? అనేదే ప్రశ్న. సౌత్ ఇండియన్ సినిమాల ద్వారా పరిచయం అయిన హీరోయిన్ అని హింట్ కూడా ఇచ్చారు. దానికి ఆన్సర్ త్రిషా. దీన్ని బట్టి త్రిష ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పవచ్చు. అయితే ఆ ప్రశ్న ఫొటో త్రిషకి కనిపించడంతో వెంటనే తన సోషల్ మీడియా అకౌంట్ లో ఆనందంగా పోస్ట్ చేసింది. నెటిజన్స్ కూడా చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News