పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. కలిసి సినిమాలు చేయడం సంగతేమో కానీ.. ఆఫ్ స్క్రీన్ లో కూడా వీళ్లు మాంచి దోస్త్ లు. అయితే.. పవన్ తో ఉన్న స్నేహాన్ని ఓ వరంగా భావిస్తున్నట్లు చెబుతుంటాడు మాటల మాంత్రికుడు. కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకకు.. పవర్ స్టార్ తో కలిసొచ్చిన త్రివిక్రమ్.. స్టేజ్ పై మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింప చేశాయి.
''పవన్ ఎంతోమందికి సాయం చేయడం కళ్లారా చూశాను. చెయ్యెత్తగానే ఆగిపోయే పవర్ కొంతమందికే ఇస్తాడు ఆ భగవంతుడు. నలుసంతైనా మంచితనం లేకపోతే ఇంతమంది ఎందుకు ప్రేమిస్తారు. నిలువెత్తు మంచితనం కాబట్టే.. ఇంతమంది వచ్చారు. మీరు రావాలని అనిపించేలా బతికే మనిషి కాబట్టి ఆయన పిలిచినా పిలవకపోయినా మీరు వస్తారు'' అన్న త్రివిక్రమ్.. కాటమరాయుడు టైటిల్ బాగా నచ్చిందన్నాడు. తను తీసిన అత్తారింటికి దారేదిలో ఈ పేరుతో పాట ఉంది కాబట్టి మొదట నచ్చిందన్న త్రివిక్రమ్.. ఆ తర్వాత మరింత డెప్త్ లోకి వెళ్లిపోయాడు.
''పవన్ అనంతపురంలో మాట్లాడుతూ అక్కడ పోటీ చేస్తానన్నపుడు సంతోషించాను. అక్కడున్న కాటమరాయుడును పొగడుతూనే ఆ పాటను పెట్టాం. ఇప్పుడదే టైటిల్ తో పవన్ వస్తున్నాడు. ఆయన మీకు మరింత చేరువ కావాలని కోరుకుంటున్నాను. సినిమాల ద్వారానే కాకుండా.. మరిన్ని మార్గాల్లో మీ అందరి గుండెల్లో ఎప్పటికీ మర్చిపోలేని స్థానం సంపాదించాలని కోరుకుంటున్నా'' అంటూ తన హృదయాన్ని ఆవిష్కరించాడు త్రివిక్రమ్.
మరింత ఆవేశంగా చెబుతూ.. ''ఆయనకు నచ్చిన కవి మాటల్లోనే చెప్పుకుంటే.. అంతా కలిపి ఇంతే కావచ్చు.. కానీ తలెత్తి చూస్తే.. ఒక దేశపు జెండాకున్న పవర్ ఉంది. ఆయన గొంతెత్తితే ఒక స్వరం కాదు. కొన్ని కోట్ల మంది చెప్పే మాట. ఆయన ముందుకు నడిస్తే ఒక అడుగు వేసినట్లు కాదు.. చాలా మంది కలిసి నడిచే అడుగు. ఆయన చేసే సాయం ఒక్కడు చేసింది కాదు.. కొన్ని కోట్ల మంది నుంచి కలిసి వచ్చింది. అందుకే దాని స్థాయి చాలా పెద్దగా ఉంటుంది. ఆయన ప్రేమ.. మీ అందరి అభిమానం.. మరింత ముందుకెళ్లాలని.. చాలా రకాలుగా ముఖ్యంగా సేవ రూపంలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను'' అంటూ త్రివిక్రమ్ ముగించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/