బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో మరోసారి అంతటి వేవ్ ని క్రియేట్ చేశారు ఎస్.ఎస్.రాజమౌళి. దర్శకధీరుడు మేకింగ్ లో హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోలేదు. అక్కడ పది మంది డైరెక్టర్లు కలిసి చేసే పనిని రాజమౌళి ఒక్కడే చేశాడు ఇక్కడ. కేవలం తన కుటుంబ సభ్యుల అండదండలతో గొప్ప ఔట్ పుట్ ని తెస్తున్నాడు.
ఇకపోతే రాజమౌళి తదుపరి ప్రయత్నంలో మరో పాన్ ఇండియా మూవీకి సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్- రానా లను .. రామ్ చరణ్ - ఎన్టీఆర్ లను పాన్ ఇండియా స్టార్లను చేసిన ఘనత రాజమౌళిది.
ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ ని పాన్ ఇండియా మార్కెట్లోకి ప్రవేశ పెడుతున్నారు. అయితే మహేష్ ఛరిష్మాకు అతడిని పాన్ ఇండియా స్టార్ గా కాదు పాన్ వరల్డ్ స్టార్ గా చూపించడమే కరెక్ట్. అతడితో ఏదైనా హాలీవుడ్ మూవీని తీయొచ్చు కదా? అంటూ అభిమానులు రాజమౌళిని ప్రశ్నిస్తున్నారు.
మహేష్ తో స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కించేందుకు రాజమౌళి సన్నాహకాల్లో ఉన్నారని కథనాలొచ్చాయి. అయితే ఇది హాలీవుడ్ రేంజులో ఉండాలన్నది అభిమానుల కోరిక. నిజానికి మహేష్ ఫేవరెట్ హీరో టామ్ క్రూజ్ నటించిన చాలా గూఢచారి కాన్సెప్ట్ సినిమాలు టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో ముడిపడినవి.
ఇప్పుడు తనని కూడా మరో టామ్ క్రూజ్ రేంజులో రాజమౌళి ఎలివేట్ చేస్తారన్న అంచనా ఏర్పడుతోంది. ఒకవేళ ఇదే జరిగితే బాహుబలి- ఆర్.ఆర్.ఆర్ ని మించి ప్రపంచ దేశాల్లో ఒక హాలీవుడ్ సినిమా తరహాలో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ఆస్కారం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఇలాంటి క్రేజీ కాంబినేషన్ తో మూవీకి బడ్జెట్లు పెట్టేందుకు నిర్మాతలు వెనకాడరన్నది అర్థం చేసుకోవాలి. వరుసగా మూడు పాన్ ఇండియా సక్సెస్ లు అందుకున్న రాజమౌళికి నాలుగో ప్రయత్నంగా హాలీవుడ్ ని ఢీకొట్టే సినిమా చేస్తే కొత్త ప్రయత్నమే అవుతుంది.