మలయాళంలో సీనియర్ సూపర్ స్టార్ హీరోలు మోహన్ లాల్ మరియు మమ్ముట్టీ. వీరిద్దరు సుదీర్ఘ కాలం పాటు మలయాళ సినీ పరిశ్రమను ఒక రేంజ్ లో ఏళేశారు అనడంలో సందేహం లేదు. ఇప్పటికి కూడా స్టార్ హీరోలు సూపర్ స్టార్ లు అంటే ఖచ్చితంగా అక్కడి అభిమానులు వీరిద్దరి పేర్లు ముందు చెప్తారు. కేవలం మలయాళంలోనే కాకుండా సౌత్ ఇండియా అన్ని భాషల్లో కూడా వీరు నటించి మెప్పించారు. ఉత్తరాది ప్రేక్షకులకు కూడా వీరు సుపరిచితం. అంతటి గుర్తింపు ఉన్న ఈ ఇద్దరు హీరోలు సింగిల్ ఫ్రేమ్ లో కనిపించడం చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. తాజాగా ఆ సంఘటన జరిగింది.
కొత్త సంవత్సరం సందర్బంగా ఈ ఇద్దరు సూపర్ స్టార్ లు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫొటోలో ఇద్దరు కూడా చాలా సహజంగా స్నేహంగా ఉండటం గమనించవచ్చు. మోహన్ లాల్ ఎప్పటిలాగే సింపుల్ లుక్ లో ఉన్నారు. కాని మమ్ముట్టీ మాత్రం హెయిర్ స్టైల్ మరియు గడ్డం కాస్త మార్చి విభిన్నంగా కనిపించారు. ఇద్దరు కూడా ఇలా కనిపించడం పట్ల మలయాళ సినీ అభిమానులు మాత్రమే కాకుండా ఆ ఇద్దరిని అభిమానించే ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు కూడా వావ్ అంటున్నారు. వీరిద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తే అద్బుతం అన్నట్లుగా ఈ ఫొటో ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కలయిక ముందు ముందు మరింతగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయాలంటూ సినీ ప్రముఖులు కూడా ఫొటోపై కామెంట్స్ చేస్తున్నారు.