రాబోయే పాన్ ఇండియా సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేనా..?

Update: 2022-04-17 01:30 GMT
కరోనా పాండమిక్ నేపథ్యంలో అలస్యమవుతూ వచ్చిన పాన్ ఇండియా చిత్రాలన్నీ ఒక్కటొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. వాటిలో సౌత్ ఇండియన్ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించగా.. వాటి దెబ్బకు హిందీ చిత్రాలు బలైపోయాయి.

గతేడాది డిసెంబర్ లో రిలీజైన 'పుష్ప: ది రైజ్' సినిమా నార్త్ సర్క్యూట్‌ లో 100 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. అదే సమయంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబడిన '83' మూవీ పరాజయం చవిచూసింది.

పలు ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ చేయబడిన 'గంగూబాయి కతియావాడి' సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇదే క్రమంలో వచ్చిన 'వాలిమై' - 'రాధేశ్యామ్' మరియు 'ఈటీ' వంటి సినిమాలు ప్లాప్స్ గా నిలిచాయి.

ఇటీవల రిలీజైన RRR మూవీ హిందీ బెల్ట్‌ లో 246 కోట్లకు పైగా వసూలు చేసి.. 250 కోట్ల మార్కుకు అతి చేరువలో ఉంది. ఇక 'బీస్ట్' సినిమా నార్త్ లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు లేటెస్టుగా ఎంట్రీ ఇచ్చిన 'కేజీఎఫ్ 2'చిత్రం బాలీవుడ్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

ఫస్ట్ డే 53.95 కోట్లు వసూలు చేసిన 'కేజీయఫ్: చాప్టర్ 2'.. శుక్రవారం 46.79 కోట్లు కలెక్ట్ చేసి రెండు రోజుల్లోనే హిందీ సర్క్యూట్స్ లో 100 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. అంటే ఇప్పటి వరకు 'పుష్ప' 'RRR' 'కేజీఎఫ్ 2' వంటి సౌత్ సినిమాలు మాత్రమే పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటగలిగాయని అర్థం అవుతుంది. అయితే రాబోయే కొద్ది నెలల్లో సరైన పాన్ ఇండియా సినిమాలు లేవనే చెప్పాలి.

'ఆచార్య' చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసే అవకాశం ఉందని కావచ్చని నివేదికలు వస్తున్నాయి. కాకపోతే ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి రెండు వారాలు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు హిందీ రిలీజ్ గురించి స్పష్టత రావడం లేదు. ప్రమోషన్స్ లేకుండా విడుదల చేస్తే 'పుష్ప' మాదిరిగా పాన్-ఇండియా వైడ్ ప్రభావం చూపుతుందో లేదో చెప్పలేం.

అడివి శేష్ నటిస్తున్న 'మేజర్' చిత్రాన్ని తెలుగు హిందీ మలయాళ భాషల్లో మే 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బయోపిక్ పాన్ ఇండియా స్థాయిలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అమీర్ ఖాన్ - అక్కినేని నాగచైతన్య కలిసి చేసిన 'లాల్ సింగ్ చద్దా' సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 12న రిలీజ్ చేయనున్నారు.

సమంత లీడ్ రోల్ లో ఆగష్టు 13న రాబోతున్న 'యశోద' మూవీ కూడా బహు భాషా చిత్రమే. అఖిల్ అక్కినేని నటిస్తున్న 'ఏజెంట్' ను పాన్ ఇండియా మూవీగా చేయడానికి మేకర్స్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఆగస్ట్ 13న ఈ సినిమా విడుదల కానుంది. విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీ ఆగస్ట్ 25న థియేటర్లలోకి రాబోతోంది.

ఇక రణబీర్ కపూర్ - అక్కినేని నాగార్జున మరియు అలియా భట్ నటించిన 'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని పాన్-ఇండియాగా రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 9న సౌత్ లో ఎస్ఎస్ రాజమౌళి రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా ఇక్కడ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి.  

ప్రభాస్ నటించిన మైథలాజికల్ డ్రామా 'ఆది పురుష్' 2023 సంక్రాంతికి విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషల్లో అందించనున్నారు. ఇక ప్రభాస్ చేస్తోన్న 'సలార్' కూడా పాన్ ఇండియా సినిమానే. ఇది వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

సెట్స్ మీదున్న రామ్ చరణ్ RC15 మూవీ మరియు త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఎన్టీఆర్ NTR30 చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' సినిమా తెలుగుతో పాటుగా పలు ఇతర భాషల్లో విడుదల కానుంది.

అయితే వీటిల్లో ఏవేవి 'పుష్ప' 'RRR' 'కేజీఎఫ్ 2' సినిమాల రేంజ్ లో పాన్ ఇండియా వైడ్ సత్తా చాటుతాయో చూడాలి.
Tags:    

Similar News