తళా అజిత్ తాజా లుక్ సర్ ప్రైజ్ చేస్తోంది. కెరీర్ లో ఎన్నో విలక్షణమైన లుక్ లతో ఆశ్చర్యపరిచిన అజిత్ మునుపటి కంటే మరో వైవిధ్యమైన లుక్ ని ట్రై చేస్తున్నారని అర్థమవుతోంది. అయితే ఇది ఏ మూవీ కోసం అంటే.. ప్రతిష్ఠాత్మక ఏకే 61 కోసమే ఈ రూపం.
ఈ లుక్ తో ఆయన తనకు అత్యంత ప్రీతిపాత్రమైన లగ్జరీ బైక్ షోరూమ్ కి విచ్చేశారు. అక్కడ సరికొత్త రూపంతో మెస్మరైజ్ చేశారు. పండిన తల నెరిసిన గడ్డంతో రేబాన్ తో ఎంతో స్టైలిష్ గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
నేర్కొండ పార్వై-వలీమై తర్వాత అజిత్ కుమార్ మరోసారి డైరెక్టర్ హెచ్ వినోద్-బోనీకపూర్ లతో కలిసి మూడోసారి జోడీ కట్టిన సంగతి తెలిసిందే. ఈ వారం ప్రారంభంలో AK61 హైదరాబాద్ రామోజీ రావు ఫిల్మ్ సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ యాక్షన్-అడ్వెంచర్ ప్రాజెక్ట్ కోసం భారీ సెట్లు వేసారు. అల్టిమేట్ స్టార్ అజిత్ తో సోమవారం (ఏప్రిల్ 11) రెగ్యులర్ షూట్ ప్రారంభమైంది. తాజా నివేదికల ప్రకారం.. రామోజీ ఫిల్మ్ సిటీలో చెన్నై మౌంట్ రోడ్ సెట్ ను నిర్మించారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. బ్యాంకు దోపిడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పి - జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాలిమై తర్వాత మరోసారి నీరవ్ షా కెమెరాను హ్యాండిల్ చేస్తున్నాడు. యోగి బాబు- అదితి రావు హైదరీ- ప్రకాష్ రాజ్- టబు తారాగణం అని తెలిసింది.
వలిమైకి నేపథ్య సంగీతం అందించిన జిబ్రాన్ ఏకే61 కి సంగీత స్వరకర్తగా భావిస్తున్నారు. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.