ఎన్టీఆర్ సినిమాకు అప‌రిచితుడుకున్న లింకేంటీ?

Update: 2022-10-18 05:14 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 'RRR' తో వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ మూవీ ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. హాలీవుడ్ మేక‌ర్స్‌, స్టార్స్‌, రైట‌ర్స్‌, డైరెక్ట‌ర్స్, విదేశీ సినీ ప్రియులఉ ఈ మూవీపై న్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ మూవీకి వ‌చ్చే ఏడాది లాస్ ఏంజిల్స్ ఓ జ‌ర‌గ‌నున్న అకాడ‌మీ అవార్డుల్లో నామినేష‌న్ కోసం రాజ‌మౌళితో పాటు యుఎస్ డిస్ట్రిబ్యూట‌ర్స్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీతో వ‌చ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ రామ్ చ‌ర‌ణ్ ..స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో త‌న 15వ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కివంచేశాడు. కీల‌క ఘ‌ట్టాల షూటింగ్ కూడా పూర్త‌యింది. త్వ‌ర‌లో తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.

అయితే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాత్రం ఇంత వ‌ర‌కు త‌ను ప్ర‌క‌టించిన 30వ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించలేక‌పోతున్నాడు. 'RRR' త‌రువాత ఎన్టీఆర్ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని తెర‌పైకి తీసుకురాబోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మే 20న ఈ మూవీ డైలాగ్ మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. 'వ‌స్తున్నా..' అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ తో రిలీజ్ చేసిన మోష‌న్ పోస్ట్ తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీల‌య్యారు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిల‌వ‌లేదు. ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించి నెల‌లు గ‌డుస్తున్న మేక‌ర్స్‌, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ అదుగో ఇదుగో అంటుండ‌టంతో మ‌రింత‌గా ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువసుధా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై సుధాక‌ర్ మిక్కినేని నిర్మించ‌బోతున్నారు.

సినిమా ఆల‌స్యం అవుతున్న నేప‌థ్యంలో ఫ్యాన్స్ అస‌హ‌నానికి గుర‌వుతున్న విష‌యం గ్ర‌హించిన ఎన్టీఆర్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు డెడ్ లైన్ ని విధించిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. డిసెంబ‌ర్ క‌ల్లా సినిమాని తేల్చాల‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు హీరో ఎన్టీఆర్ ఆల్టిమేట‌మ్ జారీ చేసిన‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌. ఇదిలా వుంటే ఈ మూవీ స్టోరీకి సంబంధించిన ఆస‌క్తిక‌రమైన విష‌యం తాజాగా వినిపిస్తోంది. ఈ సినిమా క‌థ గ‌రుడ పురాణంలోని ఓ అంశం చుట్టూ సాగుతుంద‌ని చెబుతున్నారు.

అంతే కాకుండా ఈ సినిమాకు మైథ‌లాజిక‌ల్ ట‌చ్ కూడా వుంటుంద‌ని తెలుస్తోంది. గ‌తంలో ద‌ర్శ‌కుడు శంక‌ర్ 'గ‌రుడ పురాణం' ఆధారంగా సెన్సేష‌న‌ల్ మూవీ 'అప‌రిచితుడు'ని తెర‌కెక్కించి సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌డు ఇదే 'గ‌రుడ పురాణం' ఆధారంగా ఎన్టీఆర్ - కోర‌టాల శివ మూవీ తెర‌పైకి రానుంద‌ని తెలియ‌డంతో ఫ్యాన్స్ నో డౌట్ బ్లాక్ బ‌స్ట‌ర్ రోలింగ్ అంటూ సంబ‌రాలు చేసుకుంటున్నార‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News