తెలుగు హీరో స్థాయి నుంచి పాన్ ఇండియా స్టార్ గా బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నిలిచాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి 1, 2 సినిమాలు ప్రభాస్ కి నార్త్ సైడ్ సూపర్ క్రేజ్ తీసుకొచ్చాయి. ఆ ఇమేజ్ తోనే తను వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో మన దగ్గర బోళ్తా కొట్టినా హిందీ వాళ్లకి మాత్రం బాగా ఎక్కేసింది. ఆ తర్వాత వచ్చిన రాధే శ్యాం అంచనాలను అందుకోలేదు. ప్రస్తుతం ప్రభాస్ నుంచి ఆదిపురుష్ మూవీ అది కూడా బాలీవుడ్ డైరక్టర్ తెరకెక్కించిన సినిమా త్వరలో రాబోతుంది.
ఈ సినిమాపై మొదటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ లో ఒక ఆందోళన కలుగచేస్తుంది. రామాయణ కథతో వస్తున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు. సినిమాలో సీత పాత్రలో కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలి ఖాన్ నటిస్తున్నారు. తానాజీ సినిమాతో మెప్పించిన డైరక్టర్ ఓం రౌత్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాని 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకోగా వి.ఎఫ్.ఎక్స్ పనుల వల్ల సంక్రాంతికి మిస్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.
అయితే ఆదిపురుష్ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ ముందునుండి అప్సెట్ గా ఉన్నారు. సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోగా ఈమధ్య రిలీజైన టీజర్ కూడా కార్టూన్ ఛానెల్ లో పాత్రల్లాగా నటీనటులు కనిపించడంతో నెగటివ్ టాక్ తెచ్చుకుంది.
సినిమాపై వచ్చిన ఈ బ్యాడ్ టాక్ ని మార్చేందుకే ఓం రౌత్ సినిమాని హడావిడిగా రిలీజ్ చేయకుండా టైం తీసుకోవాలని అనుకున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాని తన గత సినిమాలతో పోల్చుతూ అసంతృప్తిగా ఉన్నారు. రాధేశ్యామ్ కూడా ఇలానే ఎలాంటి అప్డేట్స్ లేకుండా వాయిదాల మీద వాయిదాలు వేయడం వల్ల సినిమా ఫ్లాప్ అయ్యిందని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా ఫీల్ అవడంలో తప్పేమి లేదు కానీ.. ఓం రౌత్ ఇదివరకు తీసిన తానాజీ సినిమా రిజల్ట్ తెలిసి కూడా అతన్ని అండర్ ఎస్టిమేట్ వేయడం కరెక్ట్ కాదు.
సినిమా వాయిదా పడటానికి సినిమా బాగా రాకపోవడం అన్నది మాత్రమే రీజన్ అయ్యుండదు. సినిమాని ప్రేక్షకులకు చేరువేయడానికి ఏ అవకాశాన్ని వదులుకోరు.. ఆ ప్రయత్నంలో ఆదిపురుష్ సినిమాని ఇంకాస్త బాగా చెక్కుతున్నారని చెప్పొచ్చు. ఆదిపురుష్ సినిమా సంక్రాంతి నుంచి సమ్మర్ కి షిఫ్ట్ అయ్యిందని టాక్. అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే ఈ టైం లో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయంపై డిజప్పాయింట్ అవుతున్నారు. కానీ సినీ విశ్లేషకులు మాత్రం ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారని రిలీజ్ చేయడం కాదు సినిమా లేట్ గా వచ్చినా వారికి నచ్చితే పండుగ చేసుకుంటారని అంటున్నారు.
బాహుబలి ప్రభాస్ కి బ్యాడ్ టైం ఎలా చెప్పండి.. ఇండియన్ సినిమాల్లో ఏ హీరో కూడా వరుసగా ఐదు సినిమాల కమిట్మెంట్ పెట్టుకోలేదు. దాదాపు ప్రభాస్ ఐదారేళ్లు బిజీ షెడ్యూల్ తో ఉన్నాడు. సో రిలీజ్ డేట్ మారినంత మాత్రాన పెద్దగా నష్టమేమి జరిగినట్టు కాదు. అందుకే ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వాల్సిన పనిలేదు జస్ట్ చిల్ అవ్వండి అంటున్నారు కొందరు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.