యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ''సలార్''. పాన్ ఇండియా స్టార్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అంశము ఫ్యాన్స్ ని విపరీతంగా ఎగ్జైట్ చేస్తోంది.
'సలార్' నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా ప్రభాస్ ను పరిచయం చేసారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. విలన్ మన్నార్ గా విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి కొత్తగా మరో స్టార్ వచ్చి చేరాడు.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'సలార్' సినిమాలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. వరదరాజు మన్నార్ గా పృథ్వీరాజ్ డిఫరెంట్ లుక్ లో.. ప్రశాంత్ నీల్ గత చిత్రాల్లో విలన్స్ మాదిరిగా క్రూరంగా కనిపించాడు.
మాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పృథ్వీరాజ్ ప్రస్తుతం యాక్టర్ కమ్ డైరెక్టర్ గా బిజీగా ఉన్నాడు. గతంలో 'పోలీస్ పోలీస్' అనే చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' చిత్రానికి వాయిస్ ఓవర్ అందించిన వర్సటైల్ నటుడు.. ఇప్పుడు ''సలార్'' లో భాగం అవుతున్నాడు.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'సలార్' లో పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అగ్ర నటుడు జాయిన్ అవడం అనేది కచ్చితంగా సినిమాకు ప్లస్ అవుతుందని భావించవచ్చు. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి మలయాళ హీరో కూడా తనవంతు సపోర్ట్ అందించే అవకాశం ఉంది.
'కేజీఎఫ్' 'కేజీఎఫ్ 2' చిత్రాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాడు. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ మరియు ఎలివేషన్స్ లో స్పెషలిస్ట్ అనిపించుకున్నాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు ప్రభాస్ ను ఊర మాస్ రోల్ లో ప్రెజెంట్ చేయబోతున్నారు.
ఆ మధ్య పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ మాస్ యాక్షన్ - కమర్షియల్ జానర్ కు కొంచెం దూరమయ్యాడని.. ఇప్పుడు 'సలార్' అనేది కంప్లీట్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ అని స్పష్టం చేశాడు. ప్రభాస్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో అలా కనిపిస్తాడని.. ఇందులో ఎలివేషన్లకు లోటు ఉండదని హింట్ ఇచ్చాడు.
నిజానికి 'బాహుబలి' తర్వాత ప్రభాస్ తన రేంజ్ కు తగ్గ సినిమాలు చేయడం లేదని అభిమానులు భావిస్తున్నారు. 'సాహో' 'రాధే శ్యామ్' సినిమాలు నిరాశ పరచడం.. 'ఆదిపురుష్' చుట్టూ ట్రోలింగ్ నడుస్తున్న నేపథ్యంలో ''సలార్'' పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది డార్లింగ్ ఇమేజ్ ను మ్యాచ్ చేసే సినిమా అవుతుందని భావిస్తున్నారు.
కాగా, 'సలార్' చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తుండగా.. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. 2023 సెప్టెంబర్ 28న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.