RC 15: శంకర్ రేంజ్ కు తగ్గట్టుగా వెరీయేషన్స్!

Update: 2023-02-13 10:40 GMT
సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం రామ్ చరణ్ 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. తండ్రి, కొడుకులుగా నటిస్తున్న రామ్ చరణ్ ఇందులో భిన్నమైన నేపధ్యాలలో క్యారెక్టర్స్ ని చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక తండ్రి పాత్రలో మాస్ లీడర్ గా అభ్యుదయ పార్టీతో రాజకీయాలలో మార్పు తీసుకురావాలని నిజాయితీ ఉన్న రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్ పాత్ర ఉండబోతుంది. ఇక రామ్ చరణ్ చేసే తండ్రి పాత్ర పేరు అప్పన్న అని తెలుస్తుంది. ఆ పాత్రకి జోడీగా అంజలి నటిస్తుంది.

ఇక ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కి సంబందించిన కీలక సన్నివేశాలని ప్రస్తుతం శంకర్ షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఇదిలా ఉంటే మరో పాత్రలో ప్రెజెంట్ నేటివిటీలో ఐఏఎస్ ఆఫీసర్ గా జిల్లా కలెక్టర్ పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు.

రాజకీయ నాయకుడి కొడుకుగా తండ్రి బాటలో నడవకుండా ప్రభుత్వ అధికారి అయ్యి రాజ్యాంగాన్ని కాపాడాలని అనుకునే పాత్రలో రామ్ చరణ్ ఈ కనిపించనున్నాడు. ఆ పాత్ర పేరు రామ్ నందన్ అని తెలుస్తుంది.

ఇక కొడుకుకి జోడీగా కైరా అద్వానీ నటిస్తుంది. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణ తో పాటు అభ్యుదయ పార్టీలో రాజకీయ కరప్షన్ నాయకుడిగా ఉన్న ఎస్.జె. సూర్య మధ్య జరిగే యుద్ధమే ఈ మూవీ కథాంశం అని తెలుస్తుంది.

కథ బట్టి చూసుకుంటే మూవీలో రామ్ చరణ్ తండ్రిగా మాస్ రోల్ లో, కొడుకుగా క్లాస్ రోల్ లో భిన్నమైన షేడ్స్ ని చూపించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఒకే సినిమాలో రెండు రకాల క్యారెక్టరైజేషన్స్ చేయడం నిజంగా ఆసక్తికర విషయం అని చెప్పాలి. మరి ఈ క్యారెక్టర్స్ తో సినిమా ప్రేక్షకులకి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అనేది చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News