వ‌ర్మ 'వ్యూహం' స్టోరీ ఇదే

Update: 2022-12-07 16:30 GMT
2024 ఎన్నిక‌ల నేప‌థ్యంలో సంల‌చ‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ 'వ్యూహం' తెలుగు రాష్ర్టాల్లో  ఎలాంటి ప్ర‌కంప‌న‌లు రెపుతోందో తెలిసిందే. 'వ్యూహం' ప్ర‌క‌ట‌న రాగానే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నో...టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడ్నో మ‌ళ్లీ కెలుకుతున్నాడాని అంతా ఓ అంచ‌నాకి వ‌చ్చేసారు. గ‌తంలో ఇద్ద‌రి నేప‌థ్యాన్ని ఆధారంగా చేసుకుని రెండు సినిమాలు చేయ‌డం..ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అనంత‌రం 'వ్యూహం' ప్ర‌క‌ట‌న రావ‌డం అన్ని రాజ‌కీయ ఎజెండాతోనే వ‌ర్మ బ‌రిలోకి దిగుతున్నార‌ని అంతా భావిస్తున్నారు.

పీకే ని ఎలా కార్న‌ర్ చేస్తున్నారు? చంద్ర‌బాబు నాయుడ్ని ఎలా ఆవిష్క‌రించ బోతున్నా డంటూ!  మీడియా క‌థ‌నాలు సైతం అంత‌కంత‌కు వెడెక్కించాయి. ప‌వ‌న్ ఫ్యాన్స్ అయితే వ‌ర్మ‌పై విమ‌ర్శ‌ల బాణాల్ని చిల‌వ‌లు.. ఫ‌ల‌వ‌లు సంధించ‌డం జ‌రిగింది.  మ‌రి ఈ క‌థ‌నాల‌న్ని నిజ‌మేనా? వ‌ర్మ అస‌లు  టార్గెట్ ఎవ‌రు? అంటే వీళ్లిద్ద‌రి కాద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

పీకే..చంద్ర‌బాబు నాయుడు ఇద్ద‌రికీ సంబంధం లేని స్టోరీ అని వ‌ర్మ మాట‌ల్ని బ‌ట్టి తెలిపోయింది. ఇది పూర్తిగా ప్ర‌స్తుత‌ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేంద్రంగా సాగే స్టోరీ స్వ‌యంగా వ‌ర్మ ప్ర‌క‌టించారు. రాజశేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్  లో ఎలాంటి ప‌రిస్థితుల ఉద్భ‌వించాయి?  దాన్ని ఉప‌యోగించుకుని ఎదిగేందుకు ఎవ‌రెలాంటి వ్యూహాలు ర‌చించారు? అన్న‌ది వ‌ర్మ 'వ్యూహం'లో హైలైట్ చేస్తున్నారు.

జ‌న‌వ‌రిలో సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్న‌ట్లు వ‌ర్మ‌  రివీల్ చేసారు. ఆ త‌ర్వాత 'వ్యూహా'నికి కంటున్యూటీగా శ‌ప‌థం ఉంటుందని స్ప‌ష్టం చేసారు. దీంతో ఆ రెండు రాజ‌కీయ పార్టీల్ని ప్ర‌త్య‌క్షంగా వ‌ర్మ కెల‌క‌డం లేద‌ని తెలిసిపోతుంది. వైఎస్సార్ మ‌ర‌ణానంత‌రం కాబ‌ట్టి అప్ప‌టి 2009 నుంచి ఉమ్మ‌డి ఆంధ‌ప్ర‌దేశ్  నేత‌ల్ని వ‌ర్మ తెర‌పైకి తెచ్చే అవ‌కాశం ఉంది. అంటే ఇందులో తెలంగాణ రాజ‌కీయ నాయ‌కుల్ని కూడా హైలైట్ చేయ‌డానికి ఛాన్సెస్ ఉన్నాయి.

2014 లో ప్ర‌త్యేక రాష్ర్టం ఏర్పాటైన నేప‌థ్యంలో తెలంగాణ నాయ‌కుల రాజ‌కీయాలు ఇందులో కీలకం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. వైఎస్సార్ మ‌ర‌ణం ముందు వ‌ర‌కూ పిల్లిలా న‌క్కిన నాయ‌కులుంతా పులులైన వేళ అన్ని అంశాల్ని వ‌ర్మ 'వ్యూహం'లో పొంది ప‌ర‌చ‌డం ఖాయ‌మే. అయితే జ‌గన్ నేప‌థ్యాన్ని ఎక్క‌డ నుంచి తీసుకుంటున్నారు? అన్న‌ది క్లారిటీ రావాలి.  

మ‌రో ముఖ్య‌మైన అంశం ఏంటంటే?  వైఎస్సార్ మ‌ర‌ణం రాజ‌కీయ కోణంలో చూడాటానికి అవ‌కాశం ఉంద‌ని గుస గుస వినిపిస్తుంది. ఓ ప్రముఖ పార్టీ హ‌స్తం ఉంద‌ని అప్ప‌ట్లో మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. ఈ అంశాల్ని వ్యూహంలో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో క‌నిపిస్తాయ‌ని వినిపిస్తుంది. మ‌రి తుదిగా 'వ్యూహా'నికి ఇంకెన్నిమెరుగులు దిద్దుతారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News