SSMB 28: త్రివిక్రమ్ ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లేనా?

Update: 2023-03-25 14:00 GMT
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెడుతున్నారు. ఏకంగా ఐదు ఇండియన్ భాషలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక దానికి తగ్గట్లుగానే క్యాస్టింగ్ ని కూడా త్రివిక్రమ్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. సమ్మర్ వెకేషన్స్ వదులుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీ షూటింగ్ కోసం టైమ్ కేటాయించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాత్రి సమయాలలో జరుగుతుంది. యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఇక ఉగాది సందర్భంగా ఈ మూవీకి సంబందించిన అప్డేట్ ఇస్తారని అందరూ భావించారు.

అయితే అది సాధ్యం కాలేదు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశతో ఉన్నారు.  ఇక ఈ సినిమా కోసం అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నడుస్తుంది. అలాగే మరో రెండు, మూడు టైటిల్స్ కూడా వినిపించాయి. అయితే వాటిలో ఏవీ కూడా వాస్తవం కాదని ఇప్పటికే ఖరారు అయ్యింది.

ఈ నేపధ్యంలో ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఓ ఇంటరెస్టింగ్ టైటిల్ ని లాక్ చేసినట్లుగా సోషల్ మీడియాలో మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ మూవీ కోసం 'అమరావతికి అటు ఇటు' అనే టైటిల్ ని ఖరారు చేసారని బోగట్టా. ఇదే టైటిల్ ని ఫస్ట్ లుక్ పోస్టర్ తో శ్రీరామ నవమికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్.

ఈ మూవీ కథ నేపధ్యం అంతా గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ కమర్షియల్ జోనర్ లో ఈ మూవీని త్రివిక్రమ్ ఆవిష్కరిస్తున్నారు. ఇక ఈ మూవీలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, శ్రీలీల సెకండ్ లీడ్ లో నటిస్తుంది. వారి పాత్రలకి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.

Similar News